ANNAMAIAH SANKEERTANA AKHANDA MAHA YAJNA BEGINS AT TIRUPATI _ అన్న‌మాచార్య క‌ళామందిరంలో ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం” ప్రారంభం

Tirupati, 22 January 2024: On the occasion of the Prana Pratista ceremony at Sri Ram Mandir of Ayodhya, TTD has organized Annamaiah Sankeertana Akhanda Maha Yajna on Monday at Annamacharya Kala Mandiram under the auspices of its Annamacharya project.

 

Earlier the artists of the Annamacharya Project garlanded the statue of Annamacharya at the TTD Administrative Building and took out a procession upto Kala Mandiram singing sankeertans.

 

As part of the Yajna the artists will chant the sankeertans for 24 hours from 11am of Monday till  11am of Tuesday.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అన్న‌మాచార్య క‌ళామందిరంలో ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం” ప్రారంభం

తిరుప‌తి, 2024 జ‌న‌వ‌రి 22: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. అయోధ్య‌లో శ్రీ‌రామ మందిరం ప్రారంభం సంద‌ర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో అన్న‌మ‌య్య ఉత్స‌వ విగ్ర‌హానికి పూజ‌లు నిర్వ‌హించారు. అక్క‌డినుండి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ మేళ‌తాళాల మ‌ధ్య ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి చేరుకున్నారు. ఉద‌యం 11 గంటలకు అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం ప్రారంభ‌మైంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల పాటు నిరంతరాయంగా క‌ళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది