COMPLETE THE PENDING WORKS OF 280 KALYANA MANDAPAMS-EO _ టిటిడి కల్యాణమండపాలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దాలి – టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 04 Apr 2018: TTD EO Sri Anil Kumar Singhal instructed the engineering officials to identity and complete the pending civil, electrical works in all the 280 TTD Kalyana mandapams located at various places.

During the review meeting with engineering officials in TTD administrative building on Wednesday, the EO directed concerned SEs, EEs and DyEOs to identify the kalyana mandapams which are in demand based on their location and take up the renovation works immediately.

“The public feel it as a blessed opportunity to perform marriages in TTD Kalyana mandapams. So there should be regular inspections by concerned officials to the kalyana mandapams and do the neede repair without delay”, he reiterated.

Tirupati JEO Sri P Bhaskar, CE Sri Chandrasekhar Reddy, SEs Sri Ramesh Reddy, Sri Sri Ramulu, Sri Sudhakar Rao were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి కల్యాణమండపాలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దాలి –

టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 04 ఏప్రిల్‌ 2018 ; టిటిడి కల్యాణమండపాలను అత్యాధునిక వసతులతో మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ఆయన ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి కల్యాణ మండపాల్లో వివాహాలు చేసుకోవడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారని, ఇందుకు అనుగుణంగా ఆధునీకరణ పనులు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా టిటిడి నిర్వహిస్తున్న 280 కల్యాణమండపాలలో తొలిదశలో ఎక్కువ కల్యాణాలు జరిగే కల్యాణమండపాలను గుర్తించి సివిల్‌, ఎలక్ట్రికల్‌ మరమత్తులు చేపట్టాలని, అవసరమైన చోట్ల ఎసిలు ఏర్పాటు చేయాలన్నారు.

ముందుగా టిటిడి ఎస్‌ఇ, ఇఇలు మరియు డెప్యూటీ ఈవోలు తమ పరిధిలోని కల్యాణ మండపాలలో ఫ్లోరింగ్‌, పెయింటింగ్‌, టాయిలెట్లు తదితర వసతులను పరిశీలించి, అక్కడ ఉన్న వ్యర్ధాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల అభిరుచి, అవసరాలకు అనుగుణంగా టిటిడి కల్యాణమండపాలలో సౌకర్యాలు కల్పించేందుకు, మరింత ఉన్నత ప్రమణాలతో నిలిపేందుకు తీసుకోవలసిన చర్యలపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కావున ఆయా ప్రాంతాలలో ఇంజినీరింగ్‌ అధికారులు తరచూ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీరాములు, శ్రీసుధాకర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.