CONSECRATION OF SRIVARI IDOL IN SRINIVASA TEMPLE AT TIRUCHANOOR _ తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయంలో ఘనంగా శ్రీవారి విగ్రహస్థాపన

Tiruchanoor 25 April 2018 ; The Vigraha Sthapana programme was held in Sri Srinivasa Temple at Tiruchanoor on Wednesday.

Series of rituals including Vimana Kalasa Sthapana, Garudalwar Vimana Kalasa Sthapana were performed in the morning and Rajagopura Kalasa Sthapana in the evening after performing homams.

On April 26 there will be consecration of the idols of Goddess, Alwars and Sayanadhivasam and Mahashanti Homam to Srivaru, while on April 27 there will be Mahasamprokshanam between 9am and 10am.

TTD has taken up the development of this ancient temple with Rs.5crores.

Temple Spl.Gr.DyEO Sri P Munirathnam Reddy, AEO Sri Subramanyam and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయంలో ఘనంగా శ్రీవారి విగ్రహస్థాపన

తిరుపతి,25 ఏప్రిల్‌2018 ; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస ఆలయంలో బుధవారం ఉదయం శ్రీవారి విగ్రహస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విమానకలశ స్థాపన, గరుడాళ్వార్‌ విమాన కలశ స్థాపన సాయంత్రం రాజగోపుర కలశ స్థాపన చేసి హోమాది కార్యక్రమాలను నిర్వహించారు.

ఏప్రిల్‌ 26వ తేదిన సాయంత్రం ఆలయంలో స్వామివారు, అమ్మవారు, ఆళ్వార్ల నూతన విగ్రహాలను స్థాపన చేయనున్నారు. శ్రీస్వామివార్లకు పంచ శయనాధివాసము, మహాశాంతి హోమము నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 27వ తేదీ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు పున: ప్రతిష్ట, మహాసంప్రోక్షణ అత్యంత వైభవంగా నిర్వహించి, అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఆలయాన్ని రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు టిటిడి పేర్కొంది.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీ మునిరత్నం రెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, కులశేఖర్‌, రిత్వికులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.