NAGALAPURAM BRAHMOTSAVAMS FROM APRIL 29 TO MAY 7 _ ఏప్రిల్‌ 29 నుండి మే 7 తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 25 April 2018 ; The annual brahmotsavams of Sri Vedavalli Sametha Sri Vedanarayana Swamy in Nagalapuram will be observed from April 29 to May 7.

The important days includes,Dhwajarohanam on April 29, Garuda Vahanam on May 03, Rathotsavam on May 06 and Chakrasnanam on May 07.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 29 నుండి మే 07 తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 25 ఏప్రిల్‌ 2018 ; తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 29 నుండి మే 7వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్‌ 28వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 26వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

తేదీ ఉదయం సాయంత్రం

29-04-18(ఆది) ధ్వజారోహణం(మిథునలగ్నం) పెద్దశేషవాహనం

30-04-18(సోమ) చిన్నశేష వాహనం హంసవాహనం

01-05-18(మంగళ)) సింహవాహనం ముత్యపుపందిరివాహనం

02-05-18(బుధ) కల్పవృక్ష వాహనం సర్వభూపాలవాహనం

03-05-18(గురు) మోహినీ అవతారం గరుడ వాహనం

04-05-18(శుక్ర) హనుమంత వాహనం గజవాహనం

05-05-18(శని) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

06-05-18(ఆది) రథోత్సవం ఆర్జితకల్యాణోత్సవం/అశ్వవాహనం

07-05-18(సోమ) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 6వ తేదీన సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.