CONSTRUCTION OF HOSTEL BUILDINGS IN SV HIGH SCHOOL SPORTS GROUND DOES NOT CAUSE ANY INCONVENIENCE TO STUDENTS- TTD _ ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానంలో హాస్టల్ భవనాల నిర్మాణం వల్ల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేదు – టీటీడీ

Tirumala, 04 February 2024: TTD released in a statement on Sunday that there is no problem for students, employees and locals to play sports and games due to the construction of hostel buildings at the sports ground of SV High School in Tirupati.

 

To provide better accommodation to the boys studying in SV Nadaswaram School and Music and Dance College, TTD has allocated Rs.11crore towards the Construction of two hostel buildings. 

 

The two buildings will have four floors and will accommodate around 700 students with state-of-the-art facilities.  So that the students can concentrate on the arts they are studying to achieve their goals.

 

The total area of ​​SV High School sports ground is 7.50 acres.  TTD is using only 0.30 acres for boys hostel buildings.  The remaining 7.20 acres will be used by students, employees and locals for playing sports as usual.

 

However, when the facts are like this, it is not a good practice for some people on social media platforms and some media organizations to make baseless accusations against TTD damaging the reputation of the organization and spreading the fake news.

 

The devotees are therefore requested to observe the facts.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానంలో హాస్టల్ భవనాల నిర్మాణం వల్ల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేదు – టీటీడీ

తిరుపతి, 2024 ఫిబ్ర‌వరి 04: తిరుపతిలోని ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానంలో హాస్టల్ భవనాల నిర్మాణం వలన విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు క్రీడలు ఆడటానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆదివారం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎస్వి నాదస్వరం పాఠశాల మరియు సంగీత నృత్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న బాలుర విద్యార్థులకు మరింత మెరుగైన వసతి కల్పించాలని టీటీడీ రూ. 11 కోట్లతో రెండు హాస్టల్ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో నిర్మిస్తున్న రెండు భవనాలు నాలుగు అంతస్తులతో దాదాపు 700 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో వసతి కల్పించనున్నారు. తద్వారా విద్యార్థులు తమ అభ్యసిస్తున్న కళలపై ఏకాగ్రత నిలిపి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు.

ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం మొత్తం విస్తీర్ణం 7.50 ఎకరాలు. ఇందులో బాలుర హాస్టల్ భవనాలకు 0.30 ఎకరాలు మాత్రమే టీటీడీ వినియోగిస్తోంది. మిగిలిన 7.20 ఎకరాలు యధావిధిగా విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు క్రీడలు ఆడేందుకు వినియోగించుకుంటారు.

కాగా, వాస్తవాలు ఇలా ఉండగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా, కొన్ని మీడియా సంస్థలు టీటీడీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆవాస్తవలను ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు.

కావున భక్తులు వాస్తవాలను గమనించవలసిందిగా టీటీడీ కోరుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.