SWAMIJIS GIVE MESSAGE IN VC _ ధార్మిక సదస్సులో వర్చువల్ గా స్వామీజీల అనుగ్రహ భాషణం

TTD SHOULD TAKE INITIATION TOWARDS GHAR VAPASI

 

TIRUMALA, 04 FEBRUARY 2024: In the afternoon session of the ongoing Dharmika Sadas on Sunday, a few Peethadhipathis participated virtually and sent their messages.

 

SRI SHANKARA VIJAYENDRA SARASWATI SWAMIJI – KANCHI KAMAKOTI PEETHAM – KANCHIPURAM

 

The religious charity programs being conducted by TTD are very good. Dharmic campaign should also be done in the ancient temples of the Northern country.  Devotees should strive to spread Hindu Sanatana Dharma by wearing Tilakam.  Many service and charitable programs are being implemented with the co-operation of TTD.  TTD Chairman Sri Karunakara Reddy, EO Sri Dharma Reddy should jointly put more efforts to enhance the spiritual fervour to the lower level.  Encouragement should be given for Ghar Vapasi slogan (encouraging and welcoming those back to our dharma). It is commendable that TTD is doing Hindu Dharma campaign on a large scale under the leadership of both the Chairman and EO in an incredible manner by enhancing wages and incentives to Kramapathis, Ghanapathis, also allotting Rs. 2cr grant to Sampradaya Pathashalas and many more. He also appreciated TTD Chairman for naming Tirupati roads after Perivar Sri Chandrasekharendra Saraswathi Swamigal.

 

SRI RAVI SHANKAR GURUJI, BANGALAORE

 

 

Tirumala Tirupati Devasthanam is working very hard to spread Sanatana Dharma.  Thanks to Present Chairman and EO for their commitment.

It is time for us all to come together and discuss when our Dharma is in trouble.

 

he time has come to lead the youth towards righteousness.  The importance of the young woman in the preservation of Dharma is great.

 

There is a need to train the priests in the villages in the Vedic sequence of pujas as prescribed in the Vedas.

 

In urban, rural and remote areas folk songs, Yakshaganam, bhajans and kirtans should be widely publicized by Tirumala Tirupati Devasthanam and steps should be taken to encourage everyone to continue devotion.

 

We should take forward the propagation of Hindu Dharma in a way that the youth can understand.

 

Atheists can become theists by chanting Annamayya’s Sankeertans.

 

SRI VIDYA SHANKARA BHARATI SWAMY –  PUSHPAGIRI MUTT – KADAPA

 

Yagnas, pooja programs and temples are increasing.  Everyone should work for the conservation of our tradition.  TTD is doing amazing work.  The efforts of Chairman Karunakara Reddy and EO Dharma Reddy in this regard are amazing.  The decisions taken in the Dharmic Conference should be implemented.

 

SRI SATYATMA THEERTHA SWAMIJI, UTTARADI MUTT, UDIPI

 

The curriculum should be designed in such a way that the students are taught Sanatana Dharma.

 

It has also been stated that yoga should be introduced in schools to enhance physical and mental development among students.

 

It was emphasized that the spread of Hindu tradition would increase through the language of culture.

 

Sanskrit language should be treated as a training in every home.  It has been mentioned that our culture stands through Sanskrit language.

 

Tirumala Tirupati Devasthanam is making special efforts in the preservation of Sanatana Dharma. Efforts should be made to make Sanskrit language accessible to everyone which is possible with  TTD.

 

SRI VIJAYA DATTANANDA SWAMIJI – DATTA PETHAM –  MYSORE

 

Sri Venkateswara Swami appeared in Tirumala for the establishment of Dharma in Kaliyuga.  Preservation of Vedic science is essential.  The idea of ​​arranging darshan of Swamy for devotees who pen Govinda Koti is very good.

 

Dharma topics should be taken to young men and women through different programs.  Distribution of 5 crore Gita books should be done across the country.  A collective effort should be made for the welfare of society.

 

Charitable programs should be taken to common people under the auspices of TTD.  It is a very good decision of the TTD management to increase the salaries of Sambhavana priests.

 

SRI ISHAPRIYA THEERTHA SWAMIJI, UDIPI, ADAMARU MUTT

 

In the land of Bharat, Vedas and Upanishads are like two eyes. Knowledge should be increased regarding these scriptures.  Also everyone should be informed about the importance of Dharmic education.  Education and work should be provided to those in that town. Tirumala Tirupati Devasthanam is already doing many services. 

 

SRI SIDDESWARANANDA BHARATHI THEERTHA SWAMIJI, MAUNA SWAMY MUTT, COURTALLAM

 

In a country like India with 75 percent Hindu population Sanatana Dharma should be propagated in a big way with united efforts all Hindu Mutts and institutions.

 

SRIVAN SHATHAGOPA SRI RANGANATHA YATINDRA MAHA DESIKAN, ABHOBILAM

 

The great values mentioned in the Vedas should be propagated.  If we protect the Vedas, they protect us. Vedo Rakshati Rakshitaha.

 

Vedic recitation should be given priority.  Similarly Vedic scholars should also

be encouraged.  TTD Chairman Karunakara Reddy and EO Dharma Reddy are working very hard towards the preservation of Hindu Dharma through innovative and unique programs.

 

SRI RAGHAVULU, INTERNATIONAL SECRETARY OF VISHWA HINDU PARISHAD

 

Measures should be taken to prevent religious conversion.  Each Swamiji should adopt one district for charity promotion among youth and children.

 

SRI YADUGIRI YATHIRAJA SWAMIJI, SRI YADUGIRI YATHIRAJA MATH, MELKOTE

 

I compliment Tirumala Tirupati Devasthanam mandarins for undertaking many good dharmic programs

 

I bless this program be successful.

 

BRAMHATANTRA SWATANTRA SWAMIJI OF PARAKALA MUTT –  MYSORE

 

Aspired for the fruitful outcome of the Sadas

 

SRI VIDUSHEKHARA BHARTI THEERTHA SWAMIJI, UTTARADHIKARI OF SRINGERI PEETHAM

 

 

It is a pleasure to organize a religious conference at the Tirumala.

 

From my childhood, I have been watching the activities of TTD for the preservation of Vedas through Dharmika Parishad.

 

To harm Sanatana Dharma is to harm oneself. Those forces should realize that world peace is possible only because of Hindu Sanatana Dharma.

Even common people should be informed more about the richness and necessity of our Sanatana Dharma.

 

TTD Chairman Bhumana Karunakara Reddy and EO AV Dharma Reddy are conducting a religious conference in Tirumala with a great commitment and devotion.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మారుమూల గ్రామాలకు ధర్మప్రచారాన్ని వ్యాప్తి చేయాలి

– ధార్మిక సదస్సులో వర్చువల్ గా స్వామీజీల అనుగ్రహ భాషణం

ఫిబ్రవరి 04, తిరుమల, 2024: మారుమూల గ్రామాలకు ధర్మప్రచారాన్ని వ్యాప్తి చేయాలని, ఘర్ వాపసి లాంటి కార్యక్రమాల ద్వారా మతం మారిన వారిని తిరిగి ఆహ్వానించాలని పలువురు స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సులో రెండో రోజైన ఆదివారం మధ్యాహ్నం పలువురు స్వామీజీలు వర్చువల్ గా పాల్గొన్నారు.

శ్రీ రవిశంకర్ గురూజీ, బెంగళూరు.

సనాతన ధర్మ వ్యాప్తికి తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోంది. అందుకుగాను బోర్డు అధ్యక్షులకు, ఈవోకు ధన్యవాదాలు. యువతను ధర్మం వైపు నడిపించాల్సిన సమయం ఆసన్నమైంది. ధర్మ పరిరక్షణలో యువత ప్రాధాన్యత ఎంతో ఉంది. గ్రామాలలో పూజారులకు వైదిక పూజా కార్యక్రమాల విషయంలో శిక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది. పట్టణాలు, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో జానపద గీతాలు, యక్షగానం, భజనలు, కీర్తనల ద్వారా విస్తృతంగా ధర్మప్రచారం జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవాలి. అన్నమయ్య కీర్తనలు, భక్తి గీతాలాపన ద్వారా నాస్తికులు ఆస్తికులుగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది.

శ్రీ విద్యాశంకర భారతి స్వామి, పుష్పగిరి మఠం, కడప జిల్లా.

యజ్ఞాలు, పూజా కార్యక్రమాలు, ఆలయాలు పెరుగుతున్నాయి. సంప్రదాయాల పరిరక్షణ కోసం అందరూ పని చేయాలి. టీటీడీ అద్భుతమైన ధార్మిక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ విషయంలో ఛైర్మన్ శ్రీ కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి కృషి చాలా ఉంది. ధార్మిక సదస్సులో తీసుకున్న నిర్ణయాలు అమలుపరచాలి.

శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ, కంచి కామకోటి పీఠం.

టీటీడీ నిర్వహిస్తున్న ధర్మ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఉత్తర దేశంలోని ప్రాచీన ఆలయాల్లో కూడా ధార్మిక ప్రచారం జరగాలి. భక్తులు తిలకధారణ చేయడం ద్వారా హైందవ ధర్మ వ్యాప్తికి కృషి చేయాలి. టీటీడీ సహకారంతో ఎన్నో సేవా, ధార్మిక కార్యక్రమాలు అమలవుతున్నాయి. టీటీడీ ఛైర్మన్ శ్రీకరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి ధర్మ ప్రచార విస్తృతికి మరింత కృషి చేసి గ్రామస్థాయి నుండి పైస్థాయికి తీసుకు వెళ్లాల్సి ఉంది. తిరుపతిలో శ్రీ కరుణాకర రెడ్డి మంచి రోడ్ నిర్మాణం చేసి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి మార్గంగా నామకరణం చేయడం ప్రశంసనీయం. మతాంతీకరణ చెందిన హిందువులను తిరిగి సనాతన హిందూ ధర్మం వైపు తీసుకురావడానికి ఘర్ వాపసీని (మళ్లీ మన ధర్మంలోకి రావడం) ప్రోత్సహించాలి. ఛైర్మన్, ఈవో నేతృత్వంలో టీటీడీ పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేస్తుండడం అభినందనీయం.

శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ, ఉత్తరాది మఠం, బెంగళూరు.

వేద రక్షణ చేస్తే ధర్మ పరరక్షణ జరుగుతుంది. గోశాల, ఆయుర్వేద, వేద పాఠశాల వంటి ఎన్నో సంస్థలను టీటీడీ నిర్వహిస్తోంది. సనాతన, హిందూ ధర్మ ప్రచారాన్ని విశేషంగా పెంచాలి. ఇందుకోసం పీఠాధిపతుల సహకారం తీసుకోవాలి. ఆలయాల నిర్మాణం, భజన మండళ్ల ఏర్పాటు ద్వారా మతాంతీకరణను అడ్డుకోవాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు, స్వామి వారి ఫొటోలు పంపిణీ చేయాలి. పండుగలు, సంప్రదాయాల గురించి పిల్లలకు పరిచయం చేయాలి. శిల్పాలు, ఇతిహాసాలపై ప్రచారం జరగాలి.

శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, అహోబిల మఠం.

వేదాల్లో పేర్కొన్న విషయాలను ప్రచారం చేయాలి. వేదాల్ని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. వేద పారాయణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా వేద పండితులను ప్రోత్సహించాలి. టీటీడీ ఛైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు.

శ్రీ విజయదత్తానంద స్వామీజీ, ఉత్తరాధికారి, దత్త పీఠం, మైసూరు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారు ధర్మ స్థాపన కోసమే తిరుమలలో వెలిశారు. వేద శాస్త్ర సంరక్షణ చాలా అవసరం. గోవిందకోటి రాసిన భక్తులకు స్వామివారి దర్శనం ఆలోచన చాలా మంచిది. యువతీ యువకులకు ధార్మిక అంశాల్ని వేర్వేరు కార్యక్రమాల ద్వారా చేరవేయాలి. దేశ వ్యాప్తంగా 5 కోట్ల గీతా పుస్తక ప్రసాద పంపిణీ జరగాలి. సామాన్య జనంలోకి ధార్మిక కార్యక్రమాలను తీసుకెళ్లాలి. సంభావన అర్చకులకు జీతాలు పెంచుతూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం.

శ్రీ ఈశప్రియ తీర్థ స్వామీజీ, అదమారు మఠం, ఉడుపి.

హిందువులు వేదాలు, ఉపనిషత్తులకు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికీ విద్య మహత్యం గురించి తెలియపరచాలి. జ్ఞాన సంపదలను పెంచుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద సంస్థ గ్రామాల్లోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయాలి. ఇంటింటికీ సనాతన సంప్రదాయాల గురించి తెలియపరచాలి.
వేదాలు తెలిసిన వాళ్లను ప్రోత్సహించాలి. అలాగే గో సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరికీ జ్ఞాన సంపాద పెంచాలి. భగవంతుని అనుగ్రహం ప్రతి ఇంటికీ చేరేలా కార్యక్రమాన్ని పాలకమండలి అధ్యక్షులు, ఈవో చేపట్టాలి. ఇంతటి మహత్ కార్యాన్ని చేపడుతున్న ఛైర్మన్, ఈవోకు ధన్యవాదాలు.

శ్రీ సుగుణేంద్రతీర్థ స్వామీజీ, పుత్తిగె మఠం, ఉడిపి.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు మంచి కార్యాన్ని చేపట్టారు. ఇతిహాస పురాణాలు యువత సన్మార్గంలో పయనించడానికి సహాయపడతాయి. మహాభారత, రామాయణం లాంటి ఎన్నో పుస్తకాలు యువతకు మార్గదర్శనం. పిల్లలకు ఇతిహాస పురాణాలను పరిచయం చేయాలి. ఈ విషయాలను టీటీడీ కార్యరూపంలోకి తీసుకొస్తుందని ఆశిస్తున్నాను.

శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ, ఉత్తరాది మఠం, ఉడిపి.

పాఠశాల విద్యార్థులకు ధర్మాన్ని బోధించే విధంగా పాఠ్యాంశాలు ఉండాలి. యోగ సాధన విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. సంస్కృత భాష ద్వారా హిందూ సనాతన ధర్మ వ్యాప్తి పెరుగుతుంది. సంస్కృతాన్ని అందరికీ నేర్పాలి. సనాతన ధర్మ పరిరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోంది.

శ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామీజీ, శృంగేరీ పీఠం ఉత్తరాధికారి.

ధార్మిక చింతన కోసం తిరుమల పుణ్యక్షేత్రంలో ధార్మిక సదస్సు నిర్వహించడం సంతోషకరం. వేద పరిరక్షణకు టీటీడీ చేపడుతున్న చర్యలను నా చిన్నతనం నుంచే చూస్తున్నా‌. సనాతన ధర్మానికి హాని కలిగించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. సనాతన ధర్మానికి హాని కలిగించడం అంటే తమకు తాము హాని చేసుకున్నట్టే. సనాతన ధర్మం వల్లే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని వారు గ్రహించాలి. సామాన్య ప్రజలకు కూడా సనాతన ధర్మం గురించి మరింత తెలియజేయాలి.

శ్రీ యదుగిరి యతిరాజ స్వామీజీ, శ్రీ యదుగిరి యతిరాజ మఠం, మేల్ కోటె.

ధార్మిక సదస్సు నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ ధర్మారెడ్డికి మా కృతజ్ఞతలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.

శ్రీ రాఘవులు, విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి

పారాయణాల్లో మహిళల్ని బాగస్వాములను చేయాలి. ప్రచారకులను అన్ని‌ ప్రాంతాలకు పంపి‌ ధర్మ ప్రచారం చేయాలి. మత మార్పిడుల నివారణకు చర్యలు తీసుకోవాలి. యువత, బాలల్లో ధార్మిక ప్రచారం కోసం ఒక్కో స్వామీజీ ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.