COORDINATE AND MAKE SITA RAMA KALYANOTSAVAM A GRAND SUCCESS- TTD JEO _ రామయ్య కల్యాణోత్సవం సమన్వయంతో విజయవంతం చేయాలి
Vontimitta, 13, April 2022: TTD JEO Sri Veerabrahmam called TTD officials to co-ordinate with district staff to ensure grand success of Sri Sita Rama Kalyanotsavam on April 15 which is taking place after a gap of two years.
He directed them to make all efforts and ensure that devotees do not face any hurdles.
Along with YS R Kadapa district joint collector Sri Sai Kant Varma, District SP Sri KK Anburajan, Kadapa RDO Sri Dharmachandra Reddy and other officials he made a field inspection of the grand platform for Kalyanotsavam on Wednesday.
Speaking to reporters later TTD JEO said all arrangements are in place for the arrival of Honourable AP CM Sri YS Jaganmohan Reddy to all his places of visit.
He said all the entry points for VIPs, public entry points, barricading plans, parking, Prasadam distribution points, toilets etc. were inspected and valuable suggestions were made.
He said a large number of VIPs and VVIPs were expected to attend the celestial fete.
Joint collector said all the officers are being directed to work as per the action plan and see no flaw in execution.
District SP Sri KKAnburajan said tight security and vigilance arrangements are being made and asked police personnel to be alert and on vigil.
The top brass later had Darshan of Sri Kodandaramaswamy.
TTD VGO Sri Manohar, EE Smt Sumati, DE Sri Rajasekhar Tahshildars and MPDOs and other local district officers were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
రామయ్య కల్యాణోత్సవం సమన్వయంతో విజయవంతం చేయాలి
ఒంటిమిట్ట 13 ఏప్రిల్ 2022: ఒంటిమిట్టలో ఈ నెల 15వ తేదీ నిర్వహించనున్న శ్రీ కోదండ రామ స్వామి వారి కల్యాణోత్సవం టీటీడీ, జిల్లా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని టీటీడీ జెఈవో శ్రీవీరబ్రహ్మం చెప్పారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులకు చిన్న ఇబ్బంది కూడా ఎదురు కాకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వై ఎస్ ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మ, జిల్లా ఎస్పీ శ్రీ కేకే అన్బురాజన్, కడప ఆర్డీఓ శ్రీ ధర్మచంద్రా రెడ్డి, జిల్లా అధికారులు, టిటిడి అధికారులతో కలసి బుధవారం ఆయన కల్యాణోత్సవం వేదిక వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీ వీర బ్రహ్మం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కల్యాణోత్సవం వేదిక వద్ద కు చేరుకునేందుకు అనువైన ఏర్పాట్లు, ప్రముఖులు, అత్యంత ప్రముఖుల ఎంట్రీ పాయింట్, పబ్లిక్ ఎంట్రీ పాయింట్, వారి సీటింగ్ ఏర్పాట్లు, ప్రసాదాల వితరణ పాయింట్లు, బ్యారికేడింగ్ ప్లాన్, పార్కింగ్ , టాయిలెట్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. కోదండరామస్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిఐపి, విఐపిలు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగినట్లుగా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు చేశామన్నారు. అలాగే విఐపి వివిఐపి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రణాళికతో పనులు చేపట్టాలని అధికారుల ను ఆదేశించామన్నారు.
జిల్లా శ్రీఎస్పీ కేకే అన్బురాజన్ మాట్లాడుతూ, శ్రీ రాముల కళ్యాణోత్సవానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భద్రతను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.
అనంతరం వీరు శ్రీ కోదండ రామ స్వామి వారిని దర్శించుకున్నారు.
డ్వామా, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు శ్రీ యదుభూషణ రెడ్డి, శ్రీ రామమోహన్ రెడ్డి, టూరిజం అధికారి శ్రీ రాజశేఖర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, ఎస్పిడిసిఎల్ ఎస్ఈ శ్రీమతి శోభా వాలేంటినా, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీ హనుమంత రావు, భూగర్భ జలశాఖ డి డి శ్రీ మురళీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి శ్రీ వెంకటసుబ్బయ్య, టిటిడి విజిఓ శ్రీ మనోహర్, ఈఈ శ్రీమతి సుమతి, డీఈ శ్రీ రాజశేఖర్, తహసిల్దార్ లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది