COVID TEST MUST FOR DARSHAN – TTD REITERATES _ కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి

TIRUMALA, 24 DECEMBER 2021: The Tirumala Tirupati Devasthanams (TTD) has once again reiterated that only pilgrims with  Covid19 test Negative report done 48hours before or two doses vaccination certificate mandatory for Darshan or to visit Tirumala.

 

TTD has already been implementing this since October 1 onwards. But still some pilgrims are coming to Tirumala without the said reports and returning with disappointment

 

In the wake of fresh alerts by Central and State Governments in view of the fast-spreading of the Omicron virus across the country, TTD once again appealed to the devotees to come with Negative report or vaccine certificates for the benefit of their own health safety as well as that of the employees of TTD.

 

This has been done mandatory for the devotees visiting all TTD temples also. So the devotees are requested to co-operate with TTD.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 24: శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని కోర‌డ‌మైన‌ది.

ఇదివ‌ర‌కే టిటిడి ఈ విష‌యాన్ని తెలియ‌జేసిన విష‌యం విదిత‌మే.

కొంతమంది భ‌క్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద నిఘా మరియు భద్రతా సిబ్బంది త‌నిఖీ చేసి అటువంటి వారిని వెన‌క్కు పంపాల్సి వస్తోంది. దీనివ‌ల‌న అనేకమంది భ‌క్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు.

కావున భక్తులు, ఉద్యోగుల మరియు వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటి సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడికి సంబంధించిన ఇత‌ర ఆల‌యాల్లో కూడా ఈ కోవిడ్ నిబంధ‌న‌లు విధిగా పాటించాల‌ని భ‌క్తులను కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.