LANKAN PM OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ మహింద రాజపక్సే

TIRUMALA, 24 DECEMBER 2021: The Honourable Prime Minister of Sri Lanka, Sri Mahinda Rajapaksa along with his spouse Smt Shiranthi Rajapaksa offered prayers in the famous Hill Shrine of Sri Venkateswara Swamy at Tirumala on Friday.

Earlier on his arrival at Mahadwaram of the temple, he was accorded warm welcome by TTD JEO Sri Veerabrahmam and CVSO Sri Gopinath Jatti.

After Darshan he was rendered Vedaseervachanam by Vedic Pundits at Ranganayakula Mandapam. The JEO offered Theertha Prasadams and laminated photo of Srivaru to the foreign dignitary.

The Honourable Deputy Chief Minister of Andhra Pradesh Sri Narayana Swamy was also present during the Lankan PM’s Tirumala temple visit.

Tirupati Urban SP Sri Venkatappala Naidu, Tirumala Temple DyEO Sri Ramesh Babu and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ మహింద రాజపక్సే
 
డిసెంబరు 24,  తిరుమల 2021: శ్రీలంక ప్రధాన మంత్రి గౌ|| శ్రీ మహింద రాజపక్సేే తన సతీమణి శ్రీ‌మ‌తి షిరాంతి రాజ‌ప‌క్సేతో కలిసి శుక్రవారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
 
ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి  మ‌హ‌ద్వారం వ‌ద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 
 
గౌ|| శ్రీలంక ప్రధాని శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ త‌రువాత జెఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ నారాయ‌ణ‌స్వామి, అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పల నాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.