CS OFFERS PRAYERS TO HILL LORD_ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Tirumala, 6 August 2017: The Chief Secretary of Andhra Pradesh Sri Dinesh Kumar offered prayers to Lord Venkateswara in Tirumala on Sunday morning.

He was accorded warm reception by temple authorities including TTD EO Sri AK Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju.

After darshan, he was rendered Vedasirvachanam in Ranganayakula mandapam by vedic pundits.

The top brass official of TTD was presented with lord’s prasadam, lamination photo by TTD EO Sri AK Singhal.

CVSO Sri Ravi Krishna, Temple DyEO Sri Rama Rao, Reception officials Sri Haridranath, Sri Lakshminarayana Yadav and others were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

ఆగ‌స్టు 06, తిరుమల, 2017: రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ దినేష్‌కుమార్ ఆదివారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యానికి చేరుకున్న ఆయ‌న‌కు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. స్వామివారి ద‌ర్శ‌నానంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో శ్రీ‌వారి ప్ర‌సాదాన్ని, చిత్ర‌ప‌టాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో శ్రీ ఎ.ర‌వికృష్ణ‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ కోదండ‌రామారావు, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఓఎస్‌డి శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ యాద‌వ్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అనంత‌రం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ దినేష్‌కుమార్ ద‌ర్శించుకున్నారు. ఆలయం వ‌ద్ద‌కు చేర‌కున్న శ్రీ దినేష్‌కుమార్‌కు టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారి కుంకుమార్చ‌నసేవ‌లో ఆయ‌న పాల్గొన్నారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నానంత‌రం వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఆ త‌రువాత జెఈవో ప‌ట్టువస్ర్తాల‌ను, ప్ర‌సాదాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిర‌త్నంరెడ్డి, ఎఈవో శ్రీ రాధాకృష్ణ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.