TIRUMALA TEMPLE TO BE CLOSED FOR NEARLY ON AUGUST 7_ చంద్ర గ్రహణం కారణంగా ఆగస్టు 7న సా|| 4.30 నుండి ఆగస్టు 8న ఉ|| 2 గం||ల వరకు శ్రీవారి ఆలయం మూత : జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
TTD URGES DEVOTEES TO PLAN PILGRIMAGE ACCORDINGLY
Tirumala, 6 August 2017: In connection with Lunar Eclipse on August 7, the world renowned Hill Shrine of Lord Venkateswara Swamy at Tirumala will remain closed from 4:30pm on August 7 till 2am on August 8 and the devotees are requested to plan their pilgrimage accordingly, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
Speaking to media persons in Tirumala on Sunday, the JEO said, the Chandra Grahanam will last from 10:52pm on August 7 till 12:48am of August 8. “Usually six hours prior to Grahanam, the temple doors will be closed. TTD will close the doors of Tirumala temple by 4:30pm on August 7 and will re-open the doors by 2am on August 8. After performing punyahavachanam, suddhi, the early morning arjitha sevas will be performed as usual. The Sarva Darshan will commence by 7am on August 8. Even no food will be served to devotees from 4pm onwards either in Annaprasadam Complex or in queue lines on that day. So we appeal to the devotees to plan their trip to Tirumala keeping in view the lunar eclipse”, the JEO reiterated.
Meanwhile TTD has cancelled arjitha sevas including Visesha Puja, Kalyanotsavam, Unjal Seva, Arjtha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deeplankara Seva on August 7. Where as Thomala and Archana will be performed as Ekantham.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్ర గ్రహణం కారణంగా ఆగస్టు 7న సా|| 4.30 నుండి ఆగస్టు 8న ఉ|| 2 గం||ల వరకు శ్రీవారి ఆలయం మూత : జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
ఆగస్టు 06, తిరుమల, 2017 : చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4.30 నుంచి ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచుతామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలియజేశారు.
తిరుమలలో ఆదివారం జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 7వ తేదీన రాత్రి 10.52 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఆగస్టు 8న ఉదయం 12.48 గంటలకు పూర్తవుతుందని, అయితే, గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఆగస్టు 8న ఉదయం 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారని చెప్పారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అష్టదళ పాదపద్మారాధన అనంతరం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. గ్రహణం సమయంలో కంపార్ట్‌మెంట్లలోకి భక్తులకు అనుమతి ఉండదని తెలిపారు. అదేవిధంగా అన్నప్రసాద భవనం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో అన్నప్రసాద వితరణ ఉండదని తెలియజేశారు. ఆగస్టు 7న అలిపిరి మార్గంలో 4 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 2 వేల టోకెన్లు కలిపి మొత్తం 6 వేల దివ్యదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తామన్నారు. నడకదారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీన సోమవారం విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్టు తెలిపారు.
ఆగస్టు 12 నుండి 15వ తేదీ వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం
ఆగస్టు 12 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా విశేష సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి విచ్చేసే అవకాశం ఉంటుందని, సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని జెఈవో తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి టిటిడికి సహకరించాలని కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.