శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
తిరుపతి, 2019 జూన్ 17: శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ మండపంలో ఎస్.వి.సంగీత కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు డి.పి.పి. ఆధ్వర్యంలో శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించారు. ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఇ.హేమంత్‌కుమార్ ధార్మికోపన్యాసం చేశారు.
సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి టి.కౌసల్య బృందం హరికథ పారాయణం చేయనున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు ఊంజల్ సేవలో కరీంనగర్ చెందిన శ్రీ పి.రేవతి బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.