CULTURAL EVENTS AT NADA NIRANAJANAM AND ASTHANA MANDAPAM _ నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

Tirumala, 16 October 2018: The feast of cultural activities including bhakti sangeet, discourages, nama sankeertans and dance performances continued on the seventh day of the ongoing. Srivari Navaratri Brahmotsavams by hundreds of artists from several states.

The dancers, singers and folk artists excelled in their performances at the Nada Niranjanam, Asthana Madapams and the Mada streets at Tirumala. Their services were both for devotees and also as part of their devotion to Lord Venkateswara.

AT NADA NIRANJANAM

The cultural activities at Nada Niranjanam began with Mangaladwani by V Haribabu and A Sharat Babu team in the early hours of Wednesday. The students and teachers of the Sri Venkateswara Pathashala presented the Chaturveda Parayanam.

Later on the Smt K Indira team of Tirupati rendered Vishnusahasranamam while the Dharmikopanyasam by Sri Acharya Ajay of Tirupati. In the afternoon the Sri Komanduri Ramachari team from Hyderabad rendered the Anammaiyya Sankeertans followed by the Smt JB Keertana and team who presented the Nama sankeertan. In the evening the Amuktapmalya Sushama team from Tirupati presented sankeertans at Unjal Seva. The events came to an end at the Nada Niranjanam Theater for the day with the harikatha by Bhagavathakarini Jandhya Krishna Kumari of of Annamayya Project, Tirupati.

ASTHANA MANDAPAM

At the Asthana Mandapam the Sravanti Mohan and troupe from Gadwal resented the Bhakti Sangeet in the morning hours.
The TTD has rolled out bunch of Cultural events including bhakti sangeet, harokathas, and bharata natyams Annamayya sankeertans at several platforms – Nada Niranjanam and Asthana Mandapam in Tirumala, Mahati Auditorium, Annamacharya Kalyana mandir and Ramachandra pushkarini in Tirupati. Most of them are aimed at enhancing the devotional spirit of the pilgrims and also keep them engaged till the commence of Vahana sevas and other rituals in the Srivari Temple and Brahmotsavams.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

అక్టోబరు 16, తిరుమల 2018 ;శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5.00 నుండి 5.30 గంటల వరకు శ్రీ వి.హ‌రిబాబు, ఎ.శ‌ర‌త్‌బాబు బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.00 గంటల వరకు తిరుపతికి చెందిన కె.ఇందిర బృందం విష్ణుసహస్రనామం, ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఆచార్య అజ‌య్‌ ధార్మికోపన్యాసం చేశారు.

మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీ కొమండూరు రామాచారి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకు చెందిన జె.బి.కీర్త‌న‌ బృందం నామసంకీర్తనతో తిరుమ‌ల గిరులు మార్మోగాయి.

అనంత‌రం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవలో తిరుప‌తికి చెందిన ఎం.ఆముక్త‌మాల్య‌ద నుష‌మ‌ బృందం ‘బ్రహ్మ కడిగిన పాదము…., భావములోన బాహ్యమునందును…, ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు…, పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా…, కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు…., నారాయణతే నమోనమో…., ముద్దుగారే యశోద….” సంకీర్తన గానం భక్తులను తన్మయులను చేసింది.

కాగా రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీ‌మ‌తి జంధ్యాల కృష్ణ కుమారి భాగవతారిణి హరికథ పారాయణం చేశారు.

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో మంగ‌ళ‌వారం ఉదయం 11.00 నుండి 12.30 గంటల వరకు గ‌ద్వాల్‌కు చెందిన శ్రీ సంప్ర‌తి మోహ‌న్ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.