VIOLIN AND FLUTE ARTISTES SPELL MAGIC DURING VAHANA SEVAS_ తిరుప‌తిలో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సాంస్కృతిక శోభ

Tirupati, 16 October 2018: The cultural events during the ongoing Navaratri Brahmotsavam picked up the momentum on the seventh day on Tuesday with a hoary of activities in Tirupati.

With the violin vadhya tharangini presentation by Smt Challa Prabhavati, Sri Narasimhaswami and team from Tirupati presented the string instrument at Mahati Auditorium.

At the Annamacharya Kalamandiram the artists led by Smt Swarasri of Vijayawada presented Bhakti Sangeetam and mesmerized the music lovers in Tirupati.

Similarly at the Ramachandra Pushkarini, Smt V Lakshmi and team from Tirupati held the crowds spell bound with their classic instrumental presentation.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుప‌తిలో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సాంస్కృతిక శోభ

అక్టోబ‌రు 16, తిరుప‌తి 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి చ‌ల్లా ప్ర‌భావ‌తి మ‌రియు శ్రీ బి.న‌ర‌సింహ‌స్వామి బృందం వాయులీన వాద్య సంగీత కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ‌మ‌తి స్వర్ణ‌శ్రీ బృందం భ‌క్తి సంగీతం వినిపించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన వి.ల‌క్ష్మి బృందం ఫ్లూట్‌ వాద్య సంగీత కార్య‌క్ర‌మం జ‌రిగింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.