CULTURAL FEAST IN TIRUCHANOOR BRAHMOTSAVAMS _ పెద్దశేష వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్న చండ మేళం, లంబాడి నృత్యం, కోలాటాల ప్రదర్శనలు

TIRUPATI, 21 NOVEMBER 2022: The series of cultural programmes performed by different artistes in front of Pedda Sesha Vahana Seva as a part of ongoing annual brahmotsavams in Tiruchanoor was a feast to the eyes of scores of devotees.

 

On Monday, the Chandamelam performance by Sri Govindamani of Kerala stood as a special attraction. His team of 13 members from Kollam of Kerala have been performing the traditional Chandamelam – a type of drumbeat, for the past 38 years.

 

The Lambadi dance by a team of 16 artistes from Telengana State also remained cynosure while others includes Kolatam, Chekka Bhajana and many more by artistes from Proddutur, Kadapa, Eluru etc.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పెద్దశేష వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్న చండ మేళం, లంబాడి నృత్యం, కోలాటాల ప్రదర్శనలు

తిరుపతి, 2022 న‌వంబ‌రు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో చండ మేళం, లంబాడి , కోలాటాల క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

38 ఏళ్లుగా కేర‌ళ గోవింద‌మ‌ణి చండ‌మేళం

కేర‌ళ రాష్ట్రం కొళ్లాం ప్రాంతంలోని కొడ‌గ‌ల్‌కు చెందిన శ్రీ గోవింద‌మ‌ణి బృందం 38 ఏళ్లుగా తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో చండ‌మేళం(కేర‌ళ డ్ర‌మ్స్‌) వాయిస్తున్నారు. ఈ బృందంలో మొత్తం 13 మంది క‌ళాకారులు ఉన్నారు. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. వీరు టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ఒంటిమిట్టశ్రీ కోదండ‌రామాల‌యం, తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యం, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామాల‌యం, శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రాల‌యంలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల్లోనూ చండ మేళం వాయిస్తారు.

లంబాడి నృత్యం

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ కు చెందిన 16 మంది కళాకారుల బృందం లంబాడి నృత్యం చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షించారు.

అదేవిధంగా, ఏలూరుకు చెందిన రాధా మనోహర్ భజన బృందము, కడపకు చెందిన జ్యోతి భజన బృందం, ప్రొద్దుటూరు చెందిన సాయి రాజేశ్వరి భజన బృందం, పశ్చిమ గోదావరికి చెందిన కమల్ నాథ్ భజన మండలి లోని 34 మంది సభ్యులు కోలాటం నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.