TASTIER AND HYGIENIC FOOD TO SVIMS STUDENTS-JEO (E&H) _ స్విమ్స్ విద్యార్థులకు మరింత రుచి, నాణ్యమైన ఆహారం అందించండి- టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 21 NOVEMBER 2022: The Paramedical and Physiotherapy students in SVIMS should be provided with tastier and hygienic food, said TTD JEO for Education and Health Smt Sada Bhargavi.

On Monday evening, she interacted with the students and enquired about the food and other facilities being provided to them. After receiving feedback from the students, she conducted a meeting with the officials. She instructed the concerned to ensure better food in tidy environment to the students by inspecting their canteen frequently.

SVIMS Director Dr Vengamma, Additional FACAO Sri Raviprasadu, DyEO HR Sri Govindarajan and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్విమ్స్ విద్యార్థులకు మరింత రుచి, నాణ్యమైన ఆహారం అందించండి

– ఆహారం వృధా కాకుండా చూడాలి

టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 21 నవంబరు 2022: స్విమ్స్ లోని పారామెడికల్, ఫిజియోథెరఫీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఆహారం మరింత రుచిగా, నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులకు సూచించారు.

విద్యార్థులతో సోమవారం సాయంత్రం ఆమె సమావేశం నిర్వహించారు. టిఫిన్, భోజనం, స్నాక్స్ ఎలా ఉన్నాయి అనే విషయంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి సూచనలు, సలహాలు, సమస్యలను విన్నారు.
అనంతరం జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆహారం గురించి విద్యార్థుల నుంచి ఫిర్యాదు రాకూడదని చెప్పారు.వార్డన్లు, అధికారులు తరచూ వంటశాల, భోజన శాలను పరిశీలించాలని, విద్యార్ధులతో మాట్లాడి వారి ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని చెప్పారు. భోజనం శ్రీవేంకటేశ్వర స్వామి వారు అందిస్తున్న ప్రసాదమనే భావన వారిలో ఏర్పరచి వృధా కాకుండా చూడాలని ఆమె సూచించారు. వంటశాల, భోజనశాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హాస్టల్లో విద్యార్థినుల వసతి ఎలా ఉంది, గదులు సౌకర్యంగా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకున్నారు. అవసరమైన చోట మరమ్మతులు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. ప్రతి రోజు ఒక ఫ్యాకల్టీ విద్యార్థులతో పాటు హాస్టల్లో ఉండేలా చూడాలన్నారు.

అనంతరం జేఈవో విద్యార్థినుల హాస్టల్ గదులను పరిశీలించారు. వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, టీటీడీ అదనపు ఎఫ్ఎ సీఏఓ శ్రీ రవి ప్రసాదు, డిప్యూటీ ఈవో లు శ్రీ గోవింద రాజన్, శ్రీ సుబ్రమణ్యం, స్విమ్స్ జి ఎం లు శ్రీ కోటిరెడ్డి, శ్రీమతి ప్రసన్నలక్ష్మి, ఫిజియోథెరఫీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది