CULTURAL PRIGRAMMES-A CYNOSURE DURING VAHANA SEVAS_ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కనులవిందుగా కళాప్రదర్శనలు : మీడియా సమావేశంలో టిటిడి ప్రాజెక్టుల అధికారులు

Tirumala, 15 September 2018: Different project officials of TTD said that the cultural programmes during vahana sevas have been providing required devotional entertainment to devotees waiting in galleries during Brahmotsava Vahana Sevas.

During the media conference at RBRH 2 on Saturday, the Dasa Sahitya Project Special Officer, Dr PR Anandateerthacharyulu said, over 900 artistes have been invited on behalf of their project to perform during brahmotsavams.

While Smt YVS Padmavathi, Principal, SV College of Music and Dance said, every day the brahmotsavam fete commences with Nadaswara Mangala Vaidyam in Nada Neeraajanam platform. Our students have also been performing in Mahati and Annamacharya Kala mandiram in Tirupati, she added.

Alwar Divya Prabandha Project coordinator Dr Chokkalingam said, during Jiyangar Gosthi Ganam, every day one prabandham is being rendered. We have also arranged eminent Tamil scholars to give commentaries for vahana Sevas.

Annamacharya Project Director Sri Viswanath said, Annamacharya sankeertans are being rendered in all platforms in Tirupati and at Tirumala for the annual fete.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కనులవిందుగా కళాప్రదర్శనలు : మీడియా సమావేశంలో టిటిడి ప్రాజెక్టుల అధికారులు

సెప్టెంబరు 15, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేలా ఆయా ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కనులవిందుగా కళాప్రదర్శనలు ఏర్పాటు చేశామని టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య విశ్వనాథ్‌, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం తెలియజేశారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ తమ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 900 మందికి పైగా కళాకారులు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలిస్తున్నట్టు తెలిపారు. పురందరదాస రచించిన సంకీర్తనల అర్థాన్ని వివరిస్తూ నృత్య ప్రదర్శనలు ఏర్పాటుచేశామన్నారు. హరిదాసులు అందించిన సందేశాన్ని నాదనీరాజనం వేదికపై ప్రముఖ పండితులు ధార్మికోపన్యాసం చేస్తున్నారని చెప్పారు. మహతి కళాక్షేత్రంలో యక్షగానం కళారూపాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. సిడిలు, పుస్తక ముద్రణ, సదస్సుల నిర్వహణ, భజన బృందాల ద్వారా పురందరదాస కీర్తనలను వ్యాప్తి చేయడంతోపాటు ధర్మప్రచారం చేస్తున్నట్టు వివరించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య విశ్వనాథ్‌ మాట్లాడుతూ వాహనసేవల ముందు వివిధ కళాప్రదర్శనలతోపాటు మాడ వీధుల్లో ఏర్పాటుచేసిన వేదికలపై అన్నమయ్య సంకీర్తనలను కళాకారులు ఆలపిస్తున్నట్టు తెలిపారు. నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న అన్నమయ్య విన్నపాలు కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ప్రాజెక్టు కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై తమ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాదనీరాజనం వేదికపై ఉదయం మంగళధ్వనితో మంగళప్రదంగా కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. శ్రీవారు నాదలోలుడని, శ్రీ తాళ్లపాక అన్నమయ్య, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తనలతో గాత్ర, వాద్య, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలియజేశారు.

ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో ప్రముఖ పండితులతో తమిళంలో వ్యాఖ్యానాలు అందిస్తున్నామని, నాదనీరాజనం వేదికపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనసేవలో నిర్వహిస్తున్న జీయంగార్ల గోష్టిలో రోజుకో ప్రబంధాన్ని స్వామివారికి నివేదిస్తారని వివరించారు. తమ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆళ్వార్ల పాశురాలను, అందులోని భక్తితత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.