DRY FRUIT AND GRASS GARLANDS MUSE DURING SNAPANAM_ బాదం, కొబ్బరిపూత, వెదురుబియ్యం మాలలతో శోభాయమానంగా స్నపనతిరుమంజనం

Tirumala, 15 September 2018: Among the great grand gala of religious activities as a part of the ongoing annual brahmotsavams, Snapana Thirumanjanam is one of the most significant rituals.

The surprise display at the Snapana Thirumanjanam ritual was not just garlands with varieties of flowers but a massive green canopy made out of dry fruits, fruits, grass and grains too.

Conceptualised to appease the Lord to bestow farmers with good harvest by blessing with good rains, the utsava deities of Sridevi, Malayappaswamy and Bhudevi where decked with these Garland’s which enthralled the devotees and pilgrims.

The garlands and crowns were made of Almond, Anjeer, Cardamom, coconut sheath tender flowers, bamboo rice astonished every one and everyone appreciated the skills of the artistes who hailed from Tiruppur of Tamilnadu.

TTD EO Sri Anil Kumar Singhal, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, Garden Suptd Sri Srinivas and others took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

బాదం, కొబ్బరిపూత, వెదురుబియ్యం మాలలతో శోభాయమానంగా స్నపనతిరుమంజనం

సెప్టెంబరు 15, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలో బాదం, యాలకులు, వట్టివేరు, కొబ్బరిపూత, వెదురుబియ్యం, రోజాపూలు, తులసిమాలల అలంకరణతో శోభాయమానంగా స్నపనతిరుమంజనం జరిగింది.

ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేకమైన మాలల అలంకరణ స్వామి, అమ్మవార్ల తేజస్సును మరింత ఇనుమడింపచేసింది. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాలతో ఈ తిరుమంజనం సాగింది. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేదపారాయణం ఆలపించారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ కొబ్బరిపూత, వెదురుబియ్యం మాలలు అలంకరించినట్టు అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.