CULTURAL PROGRAMMES CAPTIVATE _ భ‌క్తిభావాన్ని పంచిన ధార్మిక‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

Tirupati, 29 Nov. 19: Devotional Cultural programmes captivated denizens of Tirupati on various platforms during the ongoing annual brahmotsavams at Tiruchanoor.

On Friday the vocal concerts by Sri Sampath Reddy and Sri Sankeerth Reddy, Smt Sailaja,  Smt Annapurna of Tirupati, Smt Sirisha of Machilipatnam mused the music lovers.

While the Bharatnatyam performed by Smt Aruna and her troupe from Srikalahasti allured the Tirupatites on Seventh day of Brahmotsavams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

భ‌క్తిభావాన్ని పంచిన ధార్మిక‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

తిరుపతి, 2019 న‌వంబ‌రు 29: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా శుక్ర‌వారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భ‌క్తిభావాన్ని పంచాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వర్యంలో వివిధ వేదిక‌ల‌పై ఏర్పాటుచేసిన‌ కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ సంద‌ర్భంగా తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ వి.హ‌రిబాబు బృందం మంగళధ్వని, ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఎమ్మిగ‌నూరుకు చెందిన శ్రీ ప‌ద్మ‌నాభాచార్య ధార్మికోప‌న్యాసం, ఉద‌యం 11 నుండి 12.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ సంప‌త్‌రెడ్డి, శ్రీ సంకీర్త్ రెడ్డి భ‌క్తి సంగీతం వినిపించారు. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుప‌తిలోని ఎస్వీ సంగీత క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ ఎం.వి.సింహాచ‌ల‌శాస్త్రి బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి పి.శైల‌జ బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజల్‌ సేవలో తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి సాకే అన్న‌పూర్ణ బృందం సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశాఖ‌కు చెందిన వార‌ణాసికి చెందిన శ్రీ బిఎస్‌వి.ప్ర‌సాద్ బృందం సంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన ప్ర‌వ‌ళ్లిక‌ బృందం సంగీత కార్య‌క్ర‌మం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద శ్రీ‌కాళ‌హ‌స్తికి చెందిన శ్రీమ‌తి పి.అరుణ బృందం భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌ నిర్వ‌హించారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు మ‌చిలీప‌ట్నంకు చెందిన శ్రీ‌మ‌తి శిరీష బృందం సంగీత కార్యక్రమం జరుగనున్నాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.