GOLDEN UMBRELLA FETE HELD _ తిరుచానూరులో బంగారు గొడుగు ఉత్స‌వం

Tiruchanoor, 29 Nov. 19: The hereditary traditional Golden Umbrella festival was held at Tiruchanoor on the penultimate day of Radhotsavam on Friday evening.

This customary fete was held under the aegis of Sri Pantulugari Ramanathan and the tonsurers of Kalyanakatta decorate the umbrella to wooden Ratham both during Tirumala and Tiruchanoor Brahmotsavams since several decades.

KKC DyEO Smt Nagaratna,  AEO Tiruchanoor temple Subramanyam participated in this event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

తిరుచానూరులో బంగారు గొడుగు ఉత్స‌వం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం బంగారు గొడుగు ఉత్స‌వం జ‌రిగింది. పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన శ్రీ రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది ఈ బంగారు గొడుగును ర‌థానికి అలంక‌రించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ గొడుగును ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా తీసుకొచ్చి ర‌థానికి అమ‌ర్చి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. శ‌నివారం ఉదయం 7.55 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. పంతులుగారి వంశీయుల ఆధ్వ‌ర్యంలో తిరుమ‌లతోపాటు తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామాల‌య బ్ర‌హ్మోత్స‌వాల్లో ర‌థోత్స‌వం ముందురోజున బంగారు గొడుగు ఉత్స‌వం నిర్వ‌హిస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో క‌ల్యాణ‌క‌ట్ట డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.