CULTURAL PROGRAMS GETS THUMBS UP _ వైభవోత్సవాల్లో కళానీరాజనం
NELLORE, 17 AUGUST 2022: The series of devotional music and dance programmes presented at the AC Subba Reddy Stadium in Sri Potti Sriramulu Nellore district as part of ongoing Sri Venkateswara Vaibhavotsavams on Wednesday, won the hearts of the denizens.
Smt Surabhi Gayatri, Smt Sirishalata, and Smt Sandhya Sekhar performed a traditional dance. Smt D Rajyalakshmi, Smt Lakshmi Kamakshi, and Smt Aruna rendered Annamacharya, Tyagaraja and Purandharadasa Sankeertans in a mellifluous manner. The Veenatrayam instrumental programme stood as a special attraction.
In the evening, during the Veedhi Utsavam, Smt Shilpa, Smt Pavita, and Smt Koteswaramma, Sri Suresh Kumar performed the Kolatam dance in front of the processional deity.
The devotees expressed their elation by cheering the artistes chanting “Govinda…Govinda” with devotional fervour.
STUDENTS PARTICIPATE:
The local students of various schools and colleges are also taking part in the unique SVV programmes at AC Subba Reddy Stadium. Apart from having a darshan of Sri Venkateswara, the students were also seen visiting the photo exhibition and bookstalls organized by TTD.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవోత్సవాల్లో కళానీరాజనం
నెల్లూరు, 2022, ఆగస్టు 17 ;నెల్లూరులో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు కళాకారులు పలు సంగీత, నృత్య కార్యక్రమాలతో స్వామివారికి కళానీరాజనం సమర్పించారు. ఈ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా ఉదయం శ్రీమతి సురభి గాయత్రి, శ్రీమతి శిరీషా లత, శ్రీమతి సంధ్యా శేఖర్ సంప్రదాయ నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీమతి డి.రాజ్యలక్ష్మి, శ్రీమతి లక్ష్మీకామాక్షి, శ్రీమతి కె.అరుణ వారి బృందాలతో కలిసి అన్నమయ్య, త్యాగయ్య, పురంధరదాస రచించిన పలు భక్తి సంకీర్తనలను చక్కగా ఆలపించారు. భక్తులు లీనమై వారితో కలిసి గోవిందనామాలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీణ త్రయం వాద్య సంగీతం భక్తులను మైమరపింపచేసింది.
సాయంత్రం తిరువీధి ఉత్సవంలో శిల్పా, పవిత్ర, సురేష్ కుమార్, కోటేశ్వరమ్మ బృందాలు చక్కగా కోలాటం ప్రదర్శించారు.
వైభవోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకుంటున్న విద్యార్థులు
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో కొలువుదీర్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రతి రోజూ పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పలు సేవలను తిలకిస్తున్నారు. టిటిడి పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలు స్వీకరించి వెళుతున్నారు. ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించి అందులోని ఆసక్తికరమైన అంశాలను ఫొటోలు తీసుకుంటున్నారు. శ్రీవారి వైభవంపై ఉన్న పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.