CULTURAL PROGRAMS IMPRESSES _ ధర్మానికి మూలం వేదం : ఆచార్య రాణి సదాశివమూర్తి

TIRUPATI, 29 JUNE 2023: On the third day evening the devotional cultural programs organised by TTD as part of ongoing Chaturveda Havanam in the Parade Grounds of TTD Administrative Building in Tirupati impressed devotees on Friday.

Acharya Rani Sadasiva Murty, VC of SVVU given a discourse on Veda Vaibhavam-Yagna Samskruti followed by Brahmakruta Saraswati Stotram by the students of SV College of Music and Dance choreographed by Smt Sailaja Reddy.

SVIHVS Special Officer Dr Vibhishana Sharma, Principal of Dance Nd Music Dr Uma Muddubala and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధర్మానికి మూలం వేదం : ఆచార్య రాణి సదాశివమూర్తి

తిరుపతి, 2023, జూలై 01: సాక్షాత్తు బ్రహ్మదేవుడు వేదాలను సృష్టించాడని, మానవులు ధర్మమార్గంలో నడవడానికి ఇవి మార్గదర్శకాలని ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానంలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం శనివారం మూడో రోజుకు చేరుకుంది. రాత్రి 7 గంటలకు ఆచార్య రాణి సదాశివమూర్తి “వేద వైభవం – యజ్ఞ సంస్కృతి” అనే అంశంపై ఉపన్యసిస్తూ భగవంతుడు సృష్టించిన వేదాలు కేవలం వినపడ్డాయని, ఆ తర్వాత గురు-శిష్య పరంపర ద్వారా ఇవి వ్యాప్తి చెందుతూ వచ్చాయని చెప్పారు. టీటీడీ చతుర్వేద హవనాల ద్వారా వేదాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతోందన్నారు. ఋగ్వేదంలో తొలి మంత్రం యజ్ఞయాగాల గురించి తెలియజేస్తుందన్నారు. లింగ పురాణం, కాశీ పురాణం, వరాహ పురాణంలో పేర్కొన్న విధంగా లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాలు నిర్వహించాలని సూచించారు.

కాగా, వేదపండితులు ఉదయం చతుర్వేద హవనం, మధ్యాహ్నం చతుర్వేద పారాయణం నిర్వహించారు.

ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు

సాయంత్రం జరిగిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ ఎం.సుధాకర్, శ్రీ ఎం.అనంతకృష్ణ బృందం లయవాద్య విన్యాస కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీ కె.సుధాకర్ బృందం సంగీత కచేరీ జరిగింది. ఇందులో పలు అన్నమయ్య కీర్తనలను చక్కగా ఆలపించారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు శ్రీమతి పి.శైలజారెడ్డి బృందం “బ్రహ్మ కృత సరస్వతీ స్త్రోత్రం” అంశంతో చక్కటి హావభావాలతో నృత్య ప్రదర్శన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఎస్వీ సంగీత కశాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్దుబాల ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.