CULTURAL PROGRAMS IMPRESSES _ ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు

TIRUPATI, 29 JUNE 2023: The devotional cultural programs organised by TTD as part of the ongoing Chaturveda Havanam in the Parade Grounds of TTD Administrative Building in Tirupati impressed devotees on Thursday evening.

 

Acharya Sri Rama Sharma given discourse on Chaturveda Havanam – Karyasiddhi followed by Ramayana Nritya Rupakam by the students of SV College of Music and Dance choreographed by Sri Ravi Subrahmanyam.

 

SVIHVS Special Officer Dr Vibhishana Sharma and others were present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుపతి 2023 జూన్ 29:టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానంలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం సందర్బంగా గురువారం సాయంత్రం జరిగిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సాయంత్రం 6 నుండి 6:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ శ్రీనివాసులు , శ్రీ కేశన్న బృందం నాదస్వరము, డోలు వాద్య సంగీతం ప్రదర్శన ఇచ్చారు . సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ జయరాం గానం చేసిన “అన్ని మంత్రములు ఇందే ఆవహించును…., అంతా రామమయం ఈ జగమంతా రామమయం…., నారాయణతే నమో నమో…., ఓ రామ నీనామ మెంతో రుచిరా….. తదితర కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయ.

రాత్రి 7 గంటలకు ఆచార్య శ్రీ రామ శర్మ “చతుర్వేద హవనం – కార్యసిద్ధి” అనే అంశంపై ఉపన్యసించారు. రాత్రి 7:50 నుండి 8:30 గంటల వరకు శ్రీ రవి సుబ్రహ్మణ్యం బృందం ప్రదర్శించిన రామాయణం నృత్య రూపకం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షం పడుతున్నప్పటికీ భక్తులు ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని తిలకించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.