CULTURAL PROGRAMS STEAL THE SHOW _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Tirupati, 27 Nov. 19: On fifth day of the ongoing annual brahmotsavams of Sri Padmavati Devi Temple, Tiruchanoor the kolatas, Bhakti sangeet, bhajans, classical dances and harikatha Parayanam organised by  TTD were a major hit with devotees.

On Wednesday  at the Asthana Mandapam of Tiruchanoor, the team of Smt Lakshmi Suvarna presented Mangaladwani and religious discourse by Acharya Vedantan Vishnu Bhattacharya. Bhakti sangeet was rendered by Tirupati team of Smt Jayalakshmi and Nagamani.

 

In the afternoon Smt Krishnakumari Bhagavatharini of Tirupati presented harikatha  Parayanam and  Smt M Shashikala team  of Tirupati recited Annamaiah vinnapalu. It was followed by sankeertans during unjal seva by team of Smt P Sailaja of Tirupati.

Similarly at the Mahati auditorium Smt Anandi Jeeva team of Tirupati presented dance ballet of Padmavathi Srinivasa Kalyanam. 

 

At Annamacharya Kala Mandiram, Smt Sailaja and Jati Nrutyalaya  of Tirupati presented dance programs.

Later on at Ramachandra Pushkarani the Bhimavaram team represented by Smt Prabhavati presented Nama sankeertans. Lastly the Vaishnavi nrutyala of Machilipatnam enthralled the audience at the Shilparamam on Tiruchanoor Road  with group dance event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 2019  న‌వంబ‌రు 27: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో బుధ‌వారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి శోభను మరింత ఇనుమడింప చేశాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థానమండపంలో నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి బి.ల‌క్ష్మీసువ‌ర్ణ‌ బృందం మంగళధ్వని, ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఆచార్య వేదాన్తంశ్రీవిష్ణుభ‌ట్టాచార్యులు ధార్మికోప‌న్యాసం చేశారు. ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన గ‌రిక‌పాటి జ‌య‌ల‌క్ష్మి మ‌రియు నాగ‌మ‌ణి బృందం వారిచే  భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.  

అనంత‌రం మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు  తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి కృష్ణ‌కుమారి  భాగ‌వ‌తారిణి హరికథ పారాయణం చేశారు. కాగా సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఎం.శ‌శిక‌ళ బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంట‌ల వ‌ర‌కు  ఊంజల్‌ సేవలో తిరుప‌తికి చెందిన పి.శైల‌జ‌ బృదం సంకీర్తన‌ల‌ను గానం చేయ‌నున్నారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఆనందిజీవ బృందంచే శ్రీ ప‌ద్మావ‌తీ శ్రీ‌నివాస క‌ల్యాణం నృత్య రూప‌కం ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ శైల‌జ‌, జ‌తీస్ నృత్యాల‌య వారిచే నృత్యం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద భీమ‌వ‌రంకు చెందిన ప్ర‌భావ‌తి బృందంచే నామ‌సంకీర్త‌న‌ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌న్నున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు మ‌చిలీప‌ట్నం చెందిన శ్రీ వైష్ణ‌వి నృత్యాల‌య బృందం నృత్య‌ కార్యక్రమాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.