GAJAGAMANI MARCHES ALONG MADA STREETS _ గజ వాహనంపై లోకమాత శ్రీ పద్మావతి అభయం
TENS OF THOUSANDS OF DEVOTEES CONVERGE
TIGHT SECURITY ARRANGEMENTS
Tiruchanoor, 27 Nov. 19: On the pleasant evening on Wednesday, Goddess Sri Padmavathi Devi in all Her divine splendour graced on Her favourite Gaja Vahanam as Loka Mata (Universal Mother) Sri Padmavathi to bless the thousands of devotees.
All the streets lead to Tiruchanoor on Wednesday evening with tens of thousands of devotees making a beeline in the mada streets to catch a glimpse of Gaja Lakshmi.
Goddess draped in colourful silk vatrams and dazzling jewels marched swiftly along four mada streets. The Lakshmi Kasula Haram brought from Tirumala stood as a special attraction during the processession.
The paraphernalia, dance troupes, kolatam artists added the flavour to the grand procession.
Amidst tight security cover by TTD Security in co-ordination with police and with the support of 200 scouts and guides and 300 srivari seva volunteers carried forwarded the procession in a smooth manner.
TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, TTD Board Members Sri Chavireddy Bhaskar Reddy, Sri Shiva Kumar, Dr Nichitha Muppavarapu, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO (FAC) Sri C Govindarajan, VSO Sri Prabhakar, Additional Health Officer Dr Sunil and other officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
గజ వాహనంపై లోకమాత శ్రీ పద్మావతి అభయం
తిరుపతి, 2019 నవంబరు 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు బుధవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవీగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. రాత్రి 7.30 నుండి 11 గంటల వరకు వాహనసేవ కోలాహలంగా సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ శివకుమార్, శ్రీమతి ఎం.నిచిత, మాజీ ఛైర్మన్ శ్రీ కనుమూరు బాపిరాజు, అర్బన్ ఎస్పి శ్రీ గజరావ్ భూపాల్, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్రభాకర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఆగమ సలహాదారు శ్రీ కాండూరి శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వర్‌రావు ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.