CULTURAL TEAMS FROM 7 STATES ON GARUDA SEVA DAY- JEO BHASKAR_ గరుడసేవ రోజున 7 రాష్ట్రాల నుండి కళాబృందాలు – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్

Tirupati, 13 October 2018: Tirupati JEO Sri P Bhaskar said that Cultural teams from seven states will present their art forms including dances, bhajans and kolatas etc. on the mada streets on the Garuda seva Day of Navaratri Brahmotsavams.

He said on the directions of EO Sri Anil Kumar Singhal, cultural troupes from AP, Gujarat, Chhattisgarh, Kerala, Karnataka, Haryana and Telangana have been invited to participate in the cultural revelry at Srivari Brahmotsavam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గరుడసేవ రోజున 7 రాష్ట్రాల నుండి కళాబృందాలు – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్

అక్టోబ‌రు 13, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 14వ తేది ఆదివారం గరుడసేవ రోజున 7 రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయని శనివారం ఉదయం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ చెప్పారు. టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్ ఘర్, కర్నాటక, కేరళ, హర్యాణా రాష్ట్రాల నుండి క‌ళాబృందాలను ఆహ్వానించామ‌న్నారు. ఆయా రాష్ట్రాల నుండి అధికారులు కూడా క‌ళాబృందాలతో పాటు వ‌చ్చార‌ని తెలిపారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.