BHAKTI ELIXIR CAPTIVATING DEVOTEES- HDPP SECRETARY DR RAMANA PRASAD_ భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలు – హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా. రమణప్రసాద్

Tirumala, 13 October 2018: The cultural activities- dances, bhakti music, folk arts and discourses all have enthralled the devotees with Bhakti Elixir and enthralled the devotees says the HDPP Secretary Dr Ramana Prasad.

Addressing reporters at the media center got up for Navaratri Brahmotsavams at Tirumala said the cultural wings of TTD- HDPP, Dasa Sahitya, Annamayya projects along with the SV Music and dance college have rolled a feast of bhajans, discourses, bhakti music and dances to engage the devotees at the Brahmotsavams both at Tirumala and Tirupati.

He said the programs were conducted at Vahana sevas, Nada Niranjanam, Asthana Mandapam in tirumala and Mahati Auditorium, Annammayya Kala Kshetra, Ramachandra Pushkarini at tirumala captivating art lovers of Temple town and also the devotees. Artists and Bhajan team from all over country performed chakka bhajan, dolatam, adugula bhajana, Pillangovi, Garagata Bhajan, Kuli gurralu, Kuluku Bhajan, Tappitagullu, Ballari drums.

The artists donning the Gods and Goddesses alankaram, Venkanna giodugus on the mada streets was a major hit with devotees TTD had also organized special presentations by popular and prestigious artists like harijkatha, s bhakti sangeet, puranic plays, yakshagana, and dance ballads. The artists also displayed their talents including nama keertans on the special mandapams set up on mada streets as well.

He said artists from Gujarat presented traditional dances, and those from
Chhattisgarh displayed Panti dance, while those from Karnataka enacted the Puja Kunita etc.

He said artists from Telangana, Kerala, Haryana and Tamil Nadu also presented their native dances and folk arts at the mada streets.

The art and culture officers from Haryana – Kaushal, Dipika Rani, Suman Dangi, Siddaraju from Karnataka, Shankaranarayan from Tamil Nadu participated in the media event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలు – హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా. రమణప్రసాద్

అక్టోబ‌రు 13, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయని హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా. రమణప్రసాద్ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు భక్తిభావాన్ని మరింత పెంచేలా తిరుమల, తిరుపతిలలోని వివిధ వేదికలపై ఆద్యాత్మిక, భక్తి, సంగీతం, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామ‌న్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం వేదిక, తిరుపతిలో మహతి, రామచంద్రపుష్కరిణి, అన్నమాచార్య కళామందిరం వేదికలపై భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. వాహనసేవల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నుండి చెక్క భజన, కోలాటం, అడుగుల భజన, పిల్లనగ్రోవి, గరగాట భజన, కీలుగుర్రాలు, కులుకు భజన, తప్పిటగుళ్ళు, బళ్ళారి డ్రమ్స్ తో భజనల బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయని తెలిపారు. వివిధ దేవతామూర్తుల ప్రదర్శనలు, వెంకన్న గొడుగు భక్తులను అలరింపజేస్తున్నాయన్నారు. ప్రసిద్ద కళాకారులచే హరికథలు, భక్తి సంగీతం, పౌరాణిక నాటకాలు, యక్షగాన ప్రదర్శన, నృత్య సంగీతం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తిరుమల నాలుగు మాడ వీధులలో ఆయా ప్రాజెక్టుల‌కు కేటాయించిన వేదికలపై వాహన సమయంలో నామసంకీర్తన చేస్తున్నారని చెప్పారు.

గుజరాత్ రాష్ట్రం నుంచి సాంప్రదాయ నృత్యం, ఛత్తీస్ ఘర్ నుండి పంతి డాన్స్, కర్నాటక నుండి పూజ కునిత, డొల్లు కునిత, చిలి పిలి గొంబె, యక్షగాన, సమన కునిత, కొంగేలు, తెలంగాణ నుండి ఒగ్గుడోలు, కొమ్ము కోయ, గుస్సాడి నృత్యం, కేరళ నుండి చెందన మేళం, హర్యాణ నుండి సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. టిటిడి విజిలెన్స్, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది చక్కటి సమన్వయంతో వాహన సేవల ముందు కళాబృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో హర్యానా రాష్ట్రం నుండి ఆర్ట్ అండ్ కల్చలర్ అధికారులు డా. దీపిక, సుమన్ డాంగీ, హిర్డే కౌషాల్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్యాటక, సాంస్కృతిక విభాగం అధికారి శ్రీ ఎం. శంకర నారాయణన్ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.