CULTURAL TROUPES ATTRACT PILGRIMS_ రథసప్తమికి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Tirupati, 12 Feb. 19: The cultural troupes which performed before vahana sevas on the occasion of Radhasapthami in the local temples enthralled pilgrims in a big manner.

Nearly 220 artistes in 15 troupes participated to perform their arts before vahana sevas in the temples of Tiruchanoor, Sri Kodandaraja Swamy, Sri Govindaraja Swamy temples.

The devotees were thrilled to see their performance of Kolatam, Chekka Bhajana, Adugula Bhajana, Venkanna Bhajana, Tirunaman Kodai etc.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

రథసప్తమికి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి,2019 ఫిబ్రవరి 12: రథస్తమి పర్వదినం సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయ.

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారికి నిర్వహించిన సప్తవాహన సేవలలోను, తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో నిర్వహించిన సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహన సేవల ముందు ఏర్పాటు చేసిన కళాబృందాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. తిరుపతి పరిసర ఆలయాలలో దాదాపు 15 గ్రూపులలో 220 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో చెక్కభజనలు, కోలాటాలు, చిడతలు, అడుగుల భజన, వెంకన్న భజన, తిరునామంకోడైలతో వివిధ కళా ప్రదర్శనలు ఇచ్చారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.