CULTURAL TROUPES SHOULD REMAIN SPECIAL ATTRACTION DURING BTUs-TIRUPATI JEO_ రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా కళాబృందాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 23 July 2018: All the projects of TTD should come out with unique cultural troupes, that should remain as a special attraction during the ensuing twin brahmotsavams in Tirumala, said, Tirupati JEO Sri P Bhaskar.
A review meeting with all projects of TTD was held at his chambers in Tirupati on Monday evening. The JEO directed the officers concerned to select versatile artistes and A-grade teams to perform during vahana sevas in the annual event.
“By next meeting you should come out with a state wise list of artistes”, he instructed. The JEO also said, on Garuda Seva day, the performance by cultural troupes should commence from the noon itself.
The devotees will be sitting in the galleries since morning, so the cultural troupes should entertain them with their rare performance”, he maintained.
HDPP Chief Sri Ramana Prasad, Dasa Sahitya Project Special Officer Dr Anandateerthacharyulu, Alwar Divya Prabandha Project co-ordinator Sri Chokkalingam, CEO SVBC Sri Venkata Nagesh, Annamacharya Project DyEO Sri Dhananjeyulu, DeputyEO General Smt Goutami were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా కళాబృందాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
తిరుపతి, 2018 జూలై 23: రానున్న శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి నైపుణ్యంగల కళాబృందాలను ఆహ్వానించి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో సోమవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై వివిధ ప్రాజెక్టుల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలను తిలకించేందుకు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులను ఆద్యంతం ఆకట్టుకునేలా కళాబృందాల ప్రదర్శనలు ఉండాలన్నారు. ప్రాజెక్టుల వారీగా కళాబృందాల జాబితాను రూపొందించాలని, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, యక్షగానం, కోలాటం తదితర కళారూపాలు ఉండాలని సూచించారు. గరుడసేవ నాడు మధ్యాహ్నం నుండే భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు కావున అప్పటినుండి కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, మాడ వీధుల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తిసంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. ఆయా కళారూపాల్లో ప్రముఖ కళాకారులతో ప్రత్యేకంగా జాబితా రూపొందించాలని కోరారు. తదుపరి సమావేశంలో ఆయా రాష్ట్రాల నుండి వచ్చే కళాబృందాల జాబితాను సమర్పించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా|| రమణప్రసాద్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ వై.వేంకటనగేష్, డెప్యూటీ ఈవో(జనరల్) శ్రీమతి గౌతమి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ధనుంజయ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.