ANKURARPANA IN SRI KT_ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati, 23 July 2018: The Ankurarpana for Pavitrotsavams in Sri Kapilewara Swamy temple was observed in Tirupati on Monday evening as per the tenets of Saivagama.

The devotees who desire to take part in the pavitrotsavams have to pay Rs.500 per ticket on which two persons will be allowed from July 24 to 26.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2018 జూలై 23: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 24 నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఇందులోభాగంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, వాస్తుశాంతి, మృత్సంగ్రహణం చేపడతారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి ఉత్సవర్లకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం చేపడతారు. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు గ్రంధి పవిత్ర సమర్పణ, మూడో రోజు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జితం సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గ హస్థులు పాల్గొనవచ్చు. ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరి రోజు పవిత్రమాల బహుమానంగా అందజేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.