CURTAINS DOWN ON GRAND JYESTABHISHEKAM AT SRIVARI TEMPLE _ వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

* SRI MALAYAPPA SWAMY AND HIS CONSORTS SHINE IN GOLDEN KAVACHAM

 

Tirumala,4, June 2023: The three-day-long Jyestabisekam festival at Srivari temple concluded on Sunday with the utsava idols of Sri Malayappaswami and his consorts clad in Bangaru ( golden ) kavacham blessed devotees.

 

As per tradition, the Gold Kavacham will remain on utsava idols till the next Jyestabisekam next year.

 

As the utsava idols remained in the sampangi prakaram temple archakas and Veda parayandars conducted the Maha shanti Homa and thereafter performed snapana thirumanjanam fete to Swami and his consorts ahead of adornment of golden kavacham and visesha pujas. 

 

For the first time in public Darshan Swami and Ammavaru will appear in their new Bangaru kavacham and bless devotees.

 

Tirumala pontiffs, TTD EO Sri AV Dharma Reddy’s couple, Temple Dyeo Sri Loganathan, VGO Sri Bali Reddy and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

– స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు

తిరుమల, 2023 జూన్ 04: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో
పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ బాలి రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.