టిటిడి సివిఎస్‌వో కార్యాలయంలో విజిలెన్స్‌ సిబ్బంది ప్రమాణం


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి సివిఎస్‌వో కార్యాలయంలో విజిలెన్స్‌ సిబ్బంది ప్రమాణం

డిసెంబరు 13, తిరుపతి, 2017: టిటిడిలో ఉద్యోగ బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహిస్తామని నిఘా, భద్రతా సిబ్బంది బుధవారం ఉదయం ప్రమాణం చేశారు. టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ ఈ మేరకు విజిలెన్స్‌ అధికారులు, సిబ్బంది చేత ప్రమాణం చేయించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తామని, నీతి, నిజాయితీతో నడుచుకుంటామని, హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ అన్యమతాన్ని పాటించడం గానీ, ప్రచారం గానీ చేయబోమని ప్రమాణం చేశారు.

అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అలిపిరి చెక్‌పాయింట్‌, సెక్టార్‌-7కు చెందిన 17 మంది విజిలెన్స్‌ సిబ్బందిని సివిఎస్‌వో అభినందించారు. ప్రశంసాపత్రంతోపాటు నగదు రివార్డును అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఎవిఎస్‌వోలు శ్రీ గంగరాజు, శ్రీ కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.