TIRUPPAVAI DISCOURSES OF DHANUR MASAM FROM DEC 16- JAN 14 2018_డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు
TTDs DIVYAPRABANDHA ALWAR PROJECT PLANS DISCOURSES AT 195 CENTRES IN COUNTRY
Tirupati, 13 December 2017: The Divyaprabanda Alwar project of TTD plans to conduct Tiruppavai discourses at 195 locations across the country besides Tirumala and Tirupati as part of its Hindu dharma promotion activity during the holy Dhanur madam from Dec 16 to Jan-14,2018.
At the Srivari Temple, Tirumala, Suprabata seva has been replaced with Tiruppavai.Similarly the Tiruppavai discourses will be conducted from 7am to 8am at the Asthana Mandapam at Tirumala and that of Sri PAT at Tirichanoor, Annamacharya Kalamandir, Varadarajaswamy Temple on KT Road, Geeta Mandiram at TTD Ramnagar quarters, Sri Malayala Sadguru Seva Samajam in Sripuram Colony, Sri Bhaktanjaneya temple at Bairagipatteda, Sri Venkateswaralayam at Tummalagunta, Sri Venkateswara temple Trust at Chandragiri road.
Discourses are organized at Sri Dharmaraja temple of Puttur in Chittoor Dist, Sri Ramalayam at Rajapalem, Sri Prasanna Varadarajaswami temple of Lakshmipuram in Kuppam. Other locations across the country were Guruvayoor in Kerala, Shironcha in Maharashtra, New Delhi, Rayagarh and Parkalkemundi n Odisha besides Telangana, Andhra Pradesh, Tamil Nadu and Karnataka.
Dhanurmasa vratam was observed by Godadevi one of the 12 Alwars for sake of Loka Kalyanam and prosperity of the country.Godadevi had penned the importance and process of the Dhanurmasam vratam in 30 rituals which are performed without fail in all the vaishnavite temples in the country.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు
తిరుమల, తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 195 కేంద్రాలు
డిసెంబరు 13, తిరుపతి, 2017: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుమల, తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 195 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ధనుర్మాసం సందర్భంగా టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ఈ ధనుర్మాసంలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై సేవించడం విశేషం. తిరుమలలోని ఆస్థానమండపం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంతోపాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయం, టిటిడి రామ్‌నగర్ క్వార్టర్స్‌లోని గీతామందిరం, శ్రీపురం కాలనీలోని శ్రీమలయాళ సద్గురు సేవా సమాజం, భైరాగిపట్టెడలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం, తుమ్మలగుంటలోని శ్రీవేంకటేశ్వరాలయం, చంద్రగిరి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్టులో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.
అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పుత్తూరులోని ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజ స్వామివారి ఆలయం, రాజపాళెంలోని శ్రీ రామాలయం, కుప్పంలోని లక్ష్మీపురంలో గల శ్రీప్రసన్న వరదరాజస్వామివారి ఆలయాల్లో ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోపాటు కేరళలోని గురువాయూర్, మహారాష్ట్రలోని శిరోంచ, న్యూఢిల్లీ, ఒడిశాలోని రాయగడ, పారలఖేముండి ప్రాంతాల్లో ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయి.
ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తాన్ని అనుసరించి 12 మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి ధనుర్మాసం వ్రతం పాటించారు. దేశ సుభిక్షాన్ని, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ గోదాదేవి శ్రీకృష్ణునిలో ఐక్యమవ్వాలనేది ఈ వ్రతం ఉద్దేశం. ఈ వ్రతం పాటించడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.
ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప విశేషం. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.