HI-FI SECURITY COVER TO TIRUMALA SOON-CVSO_ తిరుమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రత : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ

Tirumala, 4 January 2018:The hill town will be brought under hi-fi security cover soon, said TTD Chief Vigilance and Security Officer Sri Ake Ravikrishna.

Speaking to media persons in his camp office at Tirumala on Thursday, the top cop of TTD said, witj the cooperation of National Small Industries Corporation (NSIC) 1400 advanced cameras are going to set up at vital places in Tirumala soon.

“As a part of it in first phase, 280 cameras will be set up in Temple, Parakamani and mada streets out of which 175 are fixed cameras, 87 PTJ cameras and remaining 18 are fixed bullet cameras”, he informed.

Adding further he said, apart from thesr cameras, we also set up face recognition, crowd control cameras and smoke detector equipment for the safety of the pilgrims”, he maintained.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రత : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ

తిరుమల, 2018 జనవరి 04: ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ తెలిపారు. తిరుమలలోని సివిఎస్‌వో క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ తిరుమలలో మొత్తం 1400 సిసి కెమెరాలతో పటిష్టమైన భద్రత కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌ఐసి) సహకారం తీసుకున్నట్టు చెప్పారు. మొదటి దశలో హైసెక్యూరిటీ జోన్‌ అయిన శ్రీవారి ఆలయం, పరకామణి, మాడ వీధుల్లో 280 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో 175 ఫిక్స్‌డ్‌ కెమెరాలు, 87 పిటిజె కెమెరాలు, 18 ఫిక్స్‌డ్‌ బుల్లెట్‌ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం నుంచి ఈ కెమెరాల ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు అగ్నిప్రమాదాలను గుర్తించేందుకు స్మోక్‌ డిటెక్టర్‌, అసాంఘిక శక్తులను గుర్తించేందుకు ఫేస్‌ రికగ్నిషన్‌, భక్తుల రద్దీని తెలుసుకునేందుకు క్రౌడ్‌ కంట్రోల్‌ కెమెరాలను వినియోగిస్తామన్నారు. కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సిసి కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామన్నారు.

అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా సిసి కెమెరాల ఏర్పాటు పనులను సివిఎస్‌వో తనిఖీ చేశారు.

ఈ మీడియా సమావేశంలో విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఎవిఎస్‌వో శ్రీకూర్మారావు, సిఐ శ్రీ వెంకటరవి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.