జనవరి 17 నుండి 27వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

జనవరి 17 నుండి 27వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2018 జనవరి 04: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 17 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 17వ తేదీ బుధవారం సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

18-01-2018(గురువారం) ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం

19-01-2018(శుక్రవారం) సూర్యప్రభవాహనం పెద్దశేష వాహనం

20-01-2018(శనివారం) చిన్నశేష వాహనం సింహవాహనం

21-01-2018(ఆదివారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

22-01-2018(సోమవారం) ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం

23-01-2018(మంగళవారం) కల్యాణోత్సవం గజవాహనం

24-01-2018(బుధవారం) రథోత్సవం ధూళి ఉత్సవం

25-01-2018(గురువారం) సర్వభూపాల వాహనం అశ్వ వాహనం

26-01-2018(శుక్రవారం) వసంతోత్సవం, చక్రస్నానం హంసవాహనం, ధ్వజావరోహణం

27-01-2018(శనివారం) స్నపనతిరుమంజనం పుష్పయాగం

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.