CVSO BRIEFS ON TTD SECURITY TO IPS PROBATIONERS FROM UP_ టిటిడి భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపిఎస్‌లకు అవగాహన

Tirumala,9 October 2017: Twelve IPS probationers of Uttar Pradesh cadre were today appraised of the unique security infrastructure and preparedness of the TTD Vigilance department at Tirumala.

The CVSO of TTD Sri Ake Ravikrishna enlightened them with a presentation of the high-end tech has driven security arrangements for the protection of the Srivari Temple and also devotees at his camp office.

Speaking on the occasion the CVSO said all arrangements were made to ensure safe and secure darshan to devotees at Srivari Temple who come in large numbers every day.The luggage and vehicles of the devotees are checked first at the Alipiri point and again before entry into the temple there was another scanner and metal detector checking at the temple Mahadwaram.

He briefed them about the three-layer security monitoring of devotees through CC cameras, metal cordoning off at sensitive areas, Common command control, besides the use of sophisticated gadgets for the safety of devotees and assets of the hoary Srivari Temple.

Among others, the VGO Sri Ravindra Reddy and other officials participated in the session


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

టిటిడి భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపిఎస్‌లకు అవగాహన

అక్టోబరు 09, తిరుమల, 2017: ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 12 మంది ట్రైనీ ఐపిఎస్‌లకు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా వ్యవస్థపై సోమవారం సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ అవగాహన కల్పించారు. తిరుమలలోని సివిఎస్‌వో క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు. అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద స్కానర్లతో లగేజిని, వాహనాలను, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే సమయంలోనూ లగేజిని స్కానర్ల ద్వారా పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మూడంచెల భద్రతా వ్యవస్థ, రద్దీ సమయంలో భక్తుల క్రమబద్ధీకరణ, సిసిటివిల వినియోగం, కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పనితీరు, నిఘా పద్ధతులు తదితరాలను తెలియజేశారు.

ఈ సమావేశంలో విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.