SIX DAY TRAINING PROGRAM SV AYURVEDA COLLEGE_ ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో నిరంతర వైద్యవిద్య కార్యక్రమం ప్రారంభం

Tirupati,9 October 2017: Top 30 Ayurveda exponents from 25 states are participating in a six-day workshop cum training program organised by the TTD at the SV Ayurveda College.

Presiding over the inaugural event Dr, A Shankar Babu, the principal of SV Ayurveda College said the goal was to popularize the innovative treatment procedures championed by the TTD institute which commenced from 1983.Nearly 29 batches of Ayurveda doctors have so far passed through the TTD institute and held prominent positions across the country and overseas.

Sri V Muralidhar Sharma, vice chancellor of the Rasthriya Sanskrit Vidyapeeth highlighted the unique ancient knowledge of Ayurveda and that gave examples of how many of its research findings have been scientifically established as well.

TTD projects Special Officer, Sri N Muktheswar Rao said he was confident that the Ayurveda students and practitioners would fully utilize the special training camp held by TTD to enlighten themselves and serve the society by providing quality treatment.

Eight prominent Ayurveda exponents from Delhi, Kerala and Karnataka are participating and addressing the TTD training workshop for Ayurveda practitioners from all over the country
Among others, Dr V Parvati, Supdt of TTD Ayurveda hospital and program coordinator Dr P Muralikrishna participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో నిరంతర వైద్యవిద్య కార్యక్రమం ప్రారంభం

అక్టోబరు 09, తిరుపతి, 2017: తిరుపతిలోని టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సోమవారం ఆయుర్వేద డాక్టర్లకు నిరంతర వైద్యవిద్య కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి 30 మంది ఆయర్వేద వైద్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌ డా|| ఎ.శంకరబాబు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంలో మరింత నైపుణ్యం పెరిగేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 1983వ సంవత్సరంలో ఆయుర్వేద కళాశాల ప్రారంభమైందని, ఇప్పటివరకు 29 బ్యాచ్‌లలో విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని దేశవ్యాప్తంగా ఆయుర్వేద రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు పునశ్ఛరణ కోసం చక్కగా ఉపయోగపడతాయన్నారు.

తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి శ్రీ వి.మురళీధరశర్మ మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రాచీనమైందని, ఎంతో శక్తివంతమైందని తెలిపారు. ఆయుర్వేదంలోని పలు అంశాలు సైన్స్‌పరంగా శాస్త్రీయంగా నిరూపితమయ్యాయని ఉదాహరణలతో వివరించారు.

టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఆయుర్వేద డాక్టర్లు నిరంతర వైద్యవిద్య కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పెంచుకుని రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆయుర్వేద విధానాలను పరిశీలించి పాటించడం ద్వారా వ్యక్తిగత నైపుణ్యం పెరగడంతోపాటు సమాజానికి ఎంతో మేలు చేసినట్లవుతుందన్నారు.

కాగా, పంచకర్మలోని 24 అంశాలపై ఆరు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరుగనుంది. ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన 8 మంది నిపుణులు శిక్షణ ఇస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా|| వి.పార్వతి, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డా|| పి.మురళీకృష్ణ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.