CVSO CONVENES DURBAR IN PAC IV_ విష్వక్సేనుడి వారసులుగా భక్తులకు భద్రత కల్పించాలి : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ

Tirumala, 27 July,2017: TTD CV&SO Sri A Ravikrishna convened durbar with vigilance and security officials and sleuths in Tirumala on Thursday evening in PAC IV common command control centre.

He called upon the sleuths to be alert round the clock and ensure safety of pilgrims with fool proof security measures.
VGOs sri Ravindra Reddy, Smt Sadalakshmi, AVSOs and other sleuths were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATi

విష్వక్సేనుడి వారసులుగా భక్తులకు భద్రత కల్పించాలి : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ

తిరుమల, 27 జూలై 2017: శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడి వారసులుగా టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది భక్తులకు మెరుగైన భద్రత కల్పించాలని టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఎ.రవికృష్ణ కోరారు. తిరుమలలోని పిఏసి-4లో గల సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో టిటిడి భద్రతా సిబ్బందితో దర్బార్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ తిరుపతి, తిరుమలలో మూడంచెల భద్రతా వ్యవస్థపై అవగాహన కల్పించారు. పాత నేరస్తులను, సంఘ విద్రోహశక్తులను, అనధికార హాకర్లను, దళారులను అలిపిరి చెక్‌పాయింట్‌ వద్దనే గుర్తించేందుకు వీలుగా ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను మరింత ఆధునీకరించి సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇస్తామన్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో గల సిసి కెమెరాలను సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజిఓలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఎవిఎస్‌వోలు శ్రీ కూర్మారావు, శ్రీ నందీశ్వరరావు, శ్రీ రామచంద్రయ్య, శ్రీ చిరంజీవి, శ్రీ శ్రీనాథరెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.