EO, JEO INSPECTS QUEUE LINES AT VENDIVAKILI_ శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద టిటిడి ఈవో, జెఈవో తనిఖీలు

Tirumala, 27 July,2017: TTD EO Sri Anil Kumar Singhal along With Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the queue lines at Vendi Vakili on Thursday evening at Tirumala.

The EO instructed the temple staffs and security to guide the pilgrims in a proper way to avoid any sort of inconvenience at vendivakili.

Earlier Tirumala JEO convened a meeting With temple staff at Ranganayakula mandapam.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATi

శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద టిటిడి ఈవో, జెఈవో తనిఖీలు

తిరుమల, 27 జూలై 2017: శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి వద్ద గల క్యూలైన్ల నిర్వహణపై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు తనిఖీలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.

వెండివాకిలి వద్ద తోపులాటకు ఆస్కారం లేకుండా భక్తుల రాకపోకలను క్రమపద్ధతిలో నిర్వహించాలని అక్కడి అధికారులకు ఈవో సూచించారు. తరచూ అనౌన్స్‌మెంట్‌ చేస్తూ వెండి వాకిలి వద్ద క్యూలైన్‌లో వెళ్లేలా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు.

ఈవో వెంట శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివో శ్రీరవీంద్రారెడ్డి, ఈఈ శ్రీ ప్రసాద్‌, ఎవిఎస్‌వో శ్రీ కూర్మారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

క్యూలైన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలి : జెఈవో

శ్రీవారి ఆలయంలో సిబ్బంది క్యూలైన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించి భక్తుల తోపులాటకు ఆస్కారం లేకుండా చూడాలని జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు సూచించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన దర్శనం కల్పించాలన్నారు. సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రద్దీ సమయాల్లో తోపులాటలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఏఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.