CVSO DONATES BLOOD ON POLICE COMMEMORATION DAY_ పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సివిఎస్‌వో రక్తదానం

Tirumala, 21 October 2017: In connection with the Police Commemoration Day on October 21, TTD Chief Vigilance and Security Officer Sri Ake Ravikrishna donated blood in Aswini Hospital in Tirumala on Saturday.

Later addressing media persons, he said, he has been doing the blood donation from the past one decade. “Along with me, 20 TTD Vigilance and 20 SPF sleuths have also made blood donation commemorating the Martyr’s Day.

He said, The Police Commemoration Day remembers the sacrifices of ten policemen who died in Chinese firing in 1959 on October 21. Chinese troops opened fire and threw grenades at a party of 20 police personnel. Ten were killed in the incident and their bodies were later cremated with full police honours at Hot Springs in North Eastern Ladakh. A Police memorial was erected at Hot Springs. As a salute to the sacrifices of these martyrs, Police Commemoration Day is observed”, he added.

Medical Superintendent Dr Kusuma, VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi and other Doctors, Vigilance Officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సివిఎస్‌వో రక్తదానం

అక్టోబరు 21, తిరుమల, 2017: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టిటిడి సివిఎస్‌వో శ్రీఆకె రవికృష్ణతో పాటు 40 మంది నిఘా, భద్రత, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది శనివారం తిరుమలలోని అశ్వని ఆసుపత్రిలో రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఇప్పటివరకు అసాంఘిక శక్తులతో పోరాడి అశువులు బాసిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించినట్టు తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. 1959వ సంవత్సరం, అక్టోబరు 21న ఇండియా-చైనా సరిహద్దుల్లో భారత భూభాగాన్ని కాపాడేందుకు 10 మంది పోలీసులు అశువులుబాసి అమరులయ్యారని, అప్పటినుంచి పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ దినోత్సవం సందర్భంగా తాను పదేళ్లుగా రక్తదానం చేస్తున్నానని సివిఎస్‌వో తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విజివో శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, అశ్విని ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా|| కుసుమ ఇతర భద్రత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.