GANAPATHI HOMAM COMMENCES IN SRI KT_ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా గణపతి హోమం

Tirupati, 21 October 2017: The three-day Ganapathi Homam commenced in Sri Kapileswara Swamy temple on Saturday as a part of the month long Homa Mahotsavams.

As a part of the Homam, Visesha Puja, Japam, Laghupurnahuti, Nivedana were performed by a team of archakas.

While in the evening Sri Ganapathi Sahasranamarchana was performed between 6pm and 8pm.

SUBRAMANYA SWAMY HOMAM ON 24,25

Meanwhile Sri Subramanya Swamy homam will be performed on October 24 and 25 in the temple.

Temple DyEO Sri Subramanyam, AEO Sri Sankar Raju and other temple staffs were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా గణపతి హోమం

తిరుపతి, 2017 అక్టోబరు 21: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం గణపతి హోమంతో విశేషపూజ, హోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన స్వామివారి సన్నిధిలో హోమాలు చేయించడం కోటిజన్మల పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.

ఆలయం వెలుపల ఏర్పాటుచేసిన యాగశాలలో శ్రీ వినాయకస్వామి ప్రతిమకు విశేష అలంకరణ చేపట్టారు. ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో అర్చక బృందం పూజ, జపం, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన నిర్వహించారు. వినాయకుడికి ప్రీతిపాత్రమైన కుడుములు, నెయ్యి, అన్నం, అటుకులు, బెల్లం, అరటిపండ్లు తదితర అష్టద్రవ్యాలతో హోమం చేపట్టారు. ఇందులో 16 నామాలతో గణపతిని స్తుతించారు.

కాగా సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం మరియు హారతి ఇవ్వనున్నారు. అక్టోబరు 22, 23వ తేదీలలో కూడా గణపతి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొన్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

అక్టోబరు 24 నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 24, 25వ తేదీలలో శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం రెండు రోజుల పాటు ఘనంగా జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ మణిస్వామి, శ్రీ స్వామినాథస్వామి, శ్రీ విజయస్వామి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.