CVSO INSPECTS MTVAC AND KKC_ అన్నప్రసాద భవనం, కల్యాణకట్టలో సివిఎస్‌వో తనిఖీలు
Tirumala, 10 August 2017: As a part of strengthening the vigilance and security in view of ensuing annual brahmotavams, the Chief Vigilance and Security Officer of TTD Sri Ake Ravikrishna inspected Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) and Kalyana Katta Complex in Tirumala on Thursday.
During his inspection, top brass official of Security and Vigilance wing verified the duties and responsibilities being executed by TTD security sleuths in these two main complexes. He also interacted with the pilgrims and received the feed back from them to further strengthen the security measures.
Later the CVSO has also felicitated Sri B Manikantha, home guard working in Common Command Control at Tirumala, for showcasing his expertise in putting an end to unauthorized hawkers and photographers through effective monitoring of CCTVs.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
అన్నప్రసాద భవనం, కల్యాణకట్టలో సివిఎస్‌వో తనిఖీలు
ఆగస్టు 10, తిరుమల 2017 : శ్రీవారి బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో నిఘా, భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ గురువారం తిరుమలలోని శ్రీ మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనం, కల్యాణకట్టలలో తనిఖీలు నిర్వహించారు.
ఈ రెండు ప్రాంతాలలో టిటిడి భద్రతాసిబ్బంది నిర్వహిస్తున్న విధులు, బాధ్యతలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. భద్రతాపరంగా చేపట్టాల్సిన అంశాలపై సివిఎస్‌వో భక్తులతో చర్చించారు. అనంతరం వారి నుంచి అభిప్రాయసేకరణ చేశారు.
అనంతరం సెంట్రల్ కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీ మణికంఠను సివిఎస్‌వో రివార్డు అందించి సన్మానించారు. తిరుమలలో అనధికార హాకర్లు, అనధికార ఫోటోగ్రాఫర్లను సిసిటివిల ద్వారా గుర్తించి పోలీసులకు అప్పగించినందుకుగాను సన్మానం చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.