CVSO INSPECTS VQC-ORIENTS TONSURERS_ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో సివిఎస్‌వో తనిఖీలు

Tirumala, 29 January 2018: The Chief Vigilance and Security Officer of TTD Sri A Ravikrishna inspected VQC compartments on Monday morning.

Following the instructions of TTD EO Sri Anil Kumar Singhal who directed the top cop of TTD to find solution to the jostling near elephant gate in VQC 1 as many pilgrims brought the issue to the notice of EO during Dial your Program on January 5, CVSO thoroughly inspected the VQC compartments.

He later instructed the concerned vigilance officer to regulate pilgrim rush in VQC 1 two lines as in VQC 2 to avoid jostling among pilgrims.

COUNSELS BARBERS

Later the CVSO oriented barbers in main kalyanakatta to serve the pilgrims and save the reputation of the institution. “If you demand money from them then you will have to face ill consequences for that. If you have any issues, pleasr bring to our notice, so that we will inform the management for amicable solution”, he added.

VGO Smt Sadalakshmi, DyEO KKC Smt Nagaratna, AVSOs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో సివిఎస్‌వో తనిఖీలు

తిరుమల, 2018 జనవరి 29: తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో చేపట్టాల్సిన మార్పులపై టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ సోమవారం తనిఖీలు నిర్వహించారు.

జనవరి 5న జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో క్యూకాంప్లెక్స్‌లో తోపులాటను అరికట్టాలని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సివిఎస్‌వోకు సూచించారు. ఈ మేరకు సివిఎస్‌వో తనిఖీలు చేపట్టి విజిలెన్స్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 తరహాలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోనూ రెండు వరుసల్లో భక్తులను పంపి తోపులాట లేకుండా క్రమబద్ధీకరించాలన్నారు.

అనంతరం తిరుమలలోని ప్రధాన కల్యాణకట్టలో క్షురకులకు సివిఎస్‌వో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సూచించారు. అవకతవకలకు పాల్పడితే సస్పెండ్‌ అవుతారని హెచ్చరించారు. ఏవైనా సమస్యలుంటే క్షురకులు తమకు తెలియజేయాలని, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజివో శ్రీమతి సదాలక్ష్మి, ఎవిఎస్‌వోలు శ్రీ కూర్మారావు, శ్రీ నందీశ్వర్‌, శ్రీ రామచంద్రయ్య, శ్రీ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.