LOCAL TEMPLES REMAIN CLOSED ON JAN 31 FOLLOWING TOTAL LUNAR ECLIPSE_ జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

Tirupati, 29 January 2018: Owing to total lunar eclipse on January 31, all the sub-temples of TTD will remain closed for almost 12 hours.

In Tiruchanoor, the temple remains closed from 9:30am to 9:30pm and TTD has cancelled Kalyanotsavam, kumkumarchana on that day and Tiruppavada Seva on February 1.

In Sri Govindaraja Swamy temple the temple doors will be closed from 11am till 9:30pm like wise in Sri Kodanda Rama Swamy tempel also.

While in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram the temple doors will be closed from 10:30am till 9:30pm and in Appalayagunta the temple door will be closed from 11am onwards.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

తిరుపతి, 2018 జనవరి 29: చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీన బుధవారం టిటిడి అనుబంధ ఆలయాలైన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలను మూసివేస్తారు.

సాయంత్రం 5.53 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తలుపులు మూసివేస్తారు.

ఈ సందర్భంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఫిబ్రవరి 1వ తేదీ తిరుప్పావడ సేవలను టిటిడి రద్దు చేసింది.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తారు.

కాగా, రాత్రి 10.00 నుండి 12.00 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పోపై ఏడుచుట్లు తిరిగి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు.

కాగా పౌర్ణమి సందర్భంగా సాయంత్రం నిర్వహించవలసిన తిరుచ్చి ఉత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు.

ఈ సందర్భంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవంను టిటిడి రద్దు చేసింది.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 11.00 గంటలకు ఆలయం తలుపులు మూసివేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.