CVSO ORGANISES AWARENESS RALLY_ భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం సైకిల్‌ ర్యాలీ : సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

Tirupati, 27 August 2017: The Chief Vigilance and Security Officer of TTD Sri Ake Ravikrishna organised an awareness rally in Tirupati on Sunday with 400 sleuths and students.

The bicycle rally covered about 25km starting from Bharatiya Vidya Bhavan school at Alipiri and proceeded through Srinivasa Mangapuram, Chandragiri and KMM College.
Speaking on this occasion, the CVSO said, the motto behind the rally is to enlighten the masses on the importance of pollution free green environment and create awareness among the Public the various security measures being implemented by TTD in larger interests of the pilgrims.

Later the CVSO gave away prizes to women security guards and bicycles to students who stood in first three places in cycle rally.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం సైకిల్‌ ర్యాలీ : సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

ఆగస్టు 27, తిరుపతి, 2017: శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లు, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించినట్టు టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఆకె రవికృష్ణ తెలిపారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ పాఠశాల వద్ద ఆదివారం ఉదయం సివిఎస్‌వో జెండా ఊపి సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో సివిఎస్‌వో పాల్గొన్నారు.

భారతీయ విద్యాభవన్‌ నుంచి ప్రారంభమైన సైకిల్‌ ర్యాలీ శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి రోడ్డు, కెఎంఎం కళాశాల వరకు సుమారు 25 కి.మీ మేర సాగింది. టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది, తిరుపతిలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు కలిసి సుమారు 400 మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి సివిఎస్‌వో సైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే మొదటి మూడు స్థానాల్లో నిలిచిన టిటిడి మహిళా భద్రతా సిబ్బందికి బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌పిఎఫ్‌ కమాండెంట్‌ శ్రీ రాంరెడ్డి, డిఎస్పీలు శ్రీ మనోహర్‌, శ్రీశంకర్‌రావు, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.