TIRUMALA NAMBI AVATAROTSAVAM ON AUGUST 29_ ఆగస్టు 29న 1044వ తిరుమలనంబి అవతార మహోత్సవం

TIRUMALA, AUGUST 27: The 1044th Avatarotsavam of the great Sri Vaishnavaite Saint, Tirumala Nambi will be observed in a spiritual way in Tirumala on August 29 under the aegis of Alwar Divya Prabandha Project of TTD. This religious event will take place at Tirumala Nambi Sannidhi located in South Mada Street from 9am onwards.

TTD mandarins will take part in this fete while Prof.KE Devanathan, former VC of SV Vedic Varsity will deliver the keynote address on the special occasion. Dr VG Chokkalingam, Special Officer In-charge of Alwar Divya Prabandha Project is supervising the arrangements.

Importance: Sri Tirumala Nambi was a great religious scholar and devoted his life to “Theertha-Kainkarya” (Service of bringing holy water from Papa Vinasanam for worship of Lord of Seven Hills) at the Tirumala. Tirumala Nambi used to bring water from Papanasam situated at a distance of 8 kilometers from Tirumala for the daily puja. He was old but never allowed his age to interfere in his services. One day when Tirumalai Nambee was walking towards the temple sanctorum from Papanasanam with a pot of water, Lord appeared before him in the attire of a Fowler, and sought him to quench his thirst with water. Nambi refused to give water as it was intended for the Holy bath (Abhishekum) of the Lord and politely marched ahead.

To test his devotee, Lord who was in the guise the Fowler pierced the pot with a stone, and drank the water which oozed out of the pot. Tirumala Nambi was very sad that he could not fulfill the daily service to Lord. He said to the Fowler about his old age and hardship in once again bringing the water. Moved by his devotion, the Fowler discharged an arrow at the hillock near by in the sky and water came out gushing from the place hit by the arrow. This water which emerged from Sky became famous as “Akasa Ganga”. The Fowler directed Nambi that henceforth holy waters should be brought from Akasaganga for Lord’s abhishekam and disappeared. Nambi realised that it was none other than his beloved Lord Venkateswara.

Tirumala Nambi pioneered “Teertha Kainkarya” to Lord and he was also known as Acharya Purusha, who was one of the five gurus of Sri Ramanujacharya and also his maternal uncle.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 29న 1044వ తిరుమలనంబి అవతార మహోత్సవం

తిరుమల, 27 ఆగస్టు 2017: ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1044వ అవతారమహోత్సవం ఆగస్టు 29వ తేదీన ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| చొక్కలింగం పర్వవేక్షణలో జరుగనున్నాయి.

శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

కాగా ఆచార్య పురుషుణిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వస్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాపవినాశం నుండి తీసుకు వచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీళ్ళను కుండలో తీసుకొని వస్తుండగా సాక్షత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షింప దలచి, ఒక వేటగాని రూపంలో ఆయనను సమీపించి దాహంగా ఉందని త్రాగడానికి నీళ్ళు కావాలని ఆడిగాడు. అందుకు తిరుమలనంబి ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకానికి ఉద్ధేశించినవని, ఇవ్వడానికి కుదరదని తిరస్కరించగా, అంతట వేటగాని రూపంలో వున్న స్వామివారు తిరుమలనంబి మోసుకెళ్ళుతున్న ఆ కుండను రాయి విసరి చిల్లుచేసి నీరు త్రాగారు. అందుకు తిరుమలనంబి బాధపడుతూ ”వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్ళి స్వామివారికి అభిషేకజలం తేవడం సాధ్యంకాదు. అందువల్ల ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా”నని విచారిస్తుండగా అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు ”చింతించకు తాతా నేను నీ పూజ క్రమం తప్పకుండా సహాయం చేస్తా”నని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలాడు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ”ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యాడు. అప్పుడు తిరుమలనంబి బాలుని రూపంలో సాక్షాత్తు స్వామివారే ప్రత్యక్షమయ్యారని గ్రహించాడు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడింది.

ఈ అవతార మహోత్సవాల సందర్భంగా ఆగస్టు 29న తాతాచార్య వంశీకుల ఆధ్వర్యంలో వాల్మీకి రామాయణ పారాయణం, వేదపారాయణం చేస్తారు. తిరుమలనంబి వంశీకులకు సన్మానం జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.