చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రాన్ని సందర్శించిన టిటిడి సివిఎస్‌వో శ్రీ రవికృష్ణ
చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రాన్ని సందర్శించిన టిటిడి సివిఎస్‌వో శ్రీ రవికృష్ణ
తిరుపతి, 2017 జూలై 22: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న టిటిడి సమాచార కేంద్రాన్ని శనివారం టిటిడి సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ సందర్శించారు. అనంతరం అక్కడి భద్రతా సిబ్బందితో సివిఎస్‌వో సమావేశం నిర్వహించారు.
అనంతరం అక్కడ ఉన్న సిసి టివిల పనితీరును పరిశీలించారు. సమాచార కేంద్రంలోని శ్రీవారి ఆలయం వద్ద గల భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. ఆలయానికి విచ్చేసే భక్తులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలయం అంతా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సివిఎస్‌వో వెంట ఆలయ ఏఈవో శ్రీశ్రీనివాసులు, ఇతర సిబ్బంది ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.