VARALAKSHMI VRATHAM IN SRI PADMAVATHI AMMAVARI TEMPLE ON AUGUST 4_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పోస్టర్లు ఆవిష్కరించిన తిరుపతి జెఈవో
Tirupati, 22 July 2017: TTD JEO Sri Pola Bhaskar released Sri Padmavathi Ammavari Annual Vralakshmi Vratham wall poster to be held on Aug 4 at his chambers in Tirupati on Saturday. Later JEO Said that tickets were available for participation in the Varalakshmi Vratam celebrated at the Sri Padmavathi Temple, Tiruchanur
Two devotees could participate in one ticket of Rs.500. 200 tickets were available in current booking and another 200 tickets available at online. The The participants will be presented one Angavastram, one blouse, two laddus and two vadas as lords prasadams.
As part of the Varalakshmi vratam, special rituals will be held at the Padmavathi Ammavari temple and a procession of the deity on golden chariot in the evening besides bhajans and other cultural events on the day of Varalakshmi vratham.
In view of the Vratam all other darshans like Abhisekhanantaran darshan, Kumkumarchana, Lakshmi Pooja, Kalynotsavam and Unjal seva were cancelled.
Temple Spl Gr DyEO Sri Munirathanam Reddy, Temple Peiest Sri Babu Swamy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పోస్టర్లు ఆవిష్కరించిన తిరుపతి జెఈవో
తిరుపతి, 2017 జూలై 22: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 4న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతం పోస్టర్లు, కరపత్రాలను టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీపోల భాస్కర్ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆగస్టు 4వ తేదీ ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం, సాయంత్రం 6.00 గంటలకు అమ్మవారి స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజలసేవలను టిటిడి రద్దు చేసిందన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి తపో దీక్షకు ప్రతిఫలంగా సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు తిరుచానూరులోని పద్మాసరోవరంలో శ్రీఅలిమేలుమంగగా అవతరించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం పవిత్రమైన శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు జెఈవో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.