DARBAR KRISHNA STEALS THE SHOW_ చంద్రప్రభవాహనంపై ద‌ర్భార్ కృష్ణుడి అలంకారంలో సర్వజగదర్శకుడు

Tirumala, 16 October 2018: On the seventh day evening of the ongoing Navarathri Brahmotsavams of Lord Venkateswara at Tirumala, Sri Malayappa decked as “Darbar Krishna” took a royal ride in style on Chandra Prabha Vahanam.

Chanda, always considered as a pleasant astronomical body in the constellation. Chandra is always compared for beauty, pleasantries, purity, calmness.

Wearing a unique head gear, sitting in a majestic manner, Sri Malayappa blessed devotees.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGOs Sri Raveendra Reddy, Smt Sadalakshmi, Temple Staff and devotees took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చంద్రప్రభవాహనంపై ద‌ర్భార్ కృష్ణుడి అలంకారంలో సర్వజగదర్శకుడు

తిరుమల, 2018 అక్టోబరు 16: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు మంగ‌ళ‌వారం రాత్రి 8.00 నుండి 10.00 గంటల నడుమ శ్రీనివాసుడు ద‌ర్భార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసంతో భ‌క్త‌ల‌ను క‌టాక్షించారు.

స్వామికి సూర్యచంద్రులు రెండునేత్రాలు. ఉదయం సూర్యప్రభలో ఊరేగిన శ్రీనివాసుడు రాత్రి నిశాకరుడైన చంద్రునిప్రభతో కూడిన వాహనంపై విహరించడం ఎంతైనా సమంజసమే.

చంద్రుడు భగవంతుని మారురూపమే. గీతాచార్యుడు ”నక్షత్రాణాం అహం శశీ” తాను చుక్కలలో చంద్రుడ నని తెలియజేసాడు. అంతేకాక ”పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః” అని కూడా పురుషోత్తమప్రాప్తి యోగంలో ప్రకటించాడు. అంటే రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఓషధులను రాత్రిపురుషోత్తమప్రాప్తి యోగంలో ప్రకటించాడు. అంటే రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఓషధులను పోషిస్తున్నాడని అర్థం. ఆ ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవర ప్రభతో నేడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. పురాణాలలో చంద్రుని గురించిన ప్రస్తావన విస్తృతంగా లభిస్తున్నది. చంద్రుడు శివునికి శిరో భూషణమైతే ఇక్కడ హరికి చంద్రప్రభ వాహనంగా ఉండటం విశేషం.

ఈ చంద్రోత్పత్తి భగవంతుని మనస్సునందే కలిగిందట. అందుకే శ్రుతి ”చంద్రమా మన సో జాతః” అని వివరిస్తున్నది. సూర్యుని అనుసరించి, సూర్యకాంతితో చంద్రుడు భాసిస్తాడు కనుక సూర్యప్రభ వాహనసేవ అనంతరం చంద్రప్రభ వాహనసేవ జరగడం సముచితం.

చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు, చంద్రకాంతమణులు స్రవిస్తాయి. అదేవిధంగా చంద్రప్రభవాహనంపై స్వామిని చూడగానే భక్తమానసాంభోధులు ఉప్పొంగుతాయి. భక్తనేత్రోత్పలాలు వికసిస్తాయి. ఆనందరసం భక్తుల హృదయాలనుండి స్రవిస్తుంది. అందువల్ల ఈ వాహన సందర్శనం ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక మనే త్రివిధ తాపాలను నివారిస్తుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్, విఎస్‌వోలు శ్రీ ర‌వీంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.