“DARSHAN OF LORD VENKATESWARA GAVE ME A UNIQUE FEEL”-THAI DEVOTEE _ శ్రీ‌వారి ద‌ర్శ‌నంతో మ‌ధురానుభూతి: థాయ్‌లాండ్ భ‌క్తుడి స్పంద‌న‌

Tirumala, 28 Nov. 19: The devotees of Lord Venkateswara are spread across the globe which undoubtedly makes Him as the Universal Lord in Kaliyuga. A unique instance which took place in Tirumala on Thursday, affirms the statement. A peep into the incident.

Mr. Harrison who hailed from Bangkok of Thailand along with six other friends has booked darshan of Lord Venkateswara for November 28 by contributing donation to Sri Venkateswara Alaya Nirmana (SRIVANI) Trust on November 23. He had Netra darshan of Lord Venkateswara on Thursday.

When, the TTD Additional EO Sri AV Dharma Reddy interacted with these Thai devotees, Mr Harrison said, a few years ago one of his colleagues was badly hit in both his professional and personal life. He is an ardent devotee of Lord Venkateswara and made a vow to come for His darshan once he is out from all his problems and he fulfilled his vow. Since then I too used to learn about the miracles of Lord Venkateswara and I am a regular viewer of TTD’s SVBC programmes.  

I came to know about SRIVANI Trust and booked the ticket in on-line. I am not aware that I can also book accommodation. So I took cottage down Hill. After having Darshan of Lord, I felt completely out of the world. This has been a really new experience for me”, he added.

Later, the Thai devotee and his friends were rendered Vedasirvachanam at Ranganayakula Mandapam in Tirumala by Veda Pundits (on payment of Vedasirvachanam ticket) after Darshan of Lord Venkateswara. The Additional EO also presented the lamination photo of Lord along with Theertha Prasadams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI 

 

శ్రీ‌వారి ద‌ర్శ‌నంతో మ‌ధురానుభూతి : థాయ్‌లాండ్ భ‌క్తుడి స్పంద‌న‌

తిరుమ‌ల‌, 2019 నవంబరు 28: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం. విశ్వ‌మంతా శ్రీ‌వారి భ‌క్తులు ఉన్నార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. దీనికి బ‌లం చేకూరుస్తూ గురువారం తిరుమ‌ల‌లో ఒక ఉదంతం చోటు చేసుకుంది. దాని పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి.

థాయ్‌లాండ్ దేశంలోని బ్యాంకాక్‌కు చెందిన శ్రీ హారిస‌న్ త‌న ఆరుగురు స్నేహితుల‌తో క‌లిసి న‌వంబ‌రు 23న శ్రీ‌వాణి ట్ర‌స్టుకు ఆన్‌లైన్‌లో విరాళం అందించ‌డం ద్వారా న‌వంబ‌రు 28 నాటికి ఆరు బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరికి టికెట్లు ఖ‌రారు కావ‌డంతో గురువారం తిరుమ‌ల‌కు విచ్చేసి శ్రీ‌వారి నేత్ర ద‌ర్శ‌నం చేసుకున్నారు. విదేశీయుల‌ను గుర్తించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వారితో ముచ్చ‌టించారు.
 
ఈ సంద‌ర్భంగా శ్రీ హారిస‌న్ మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం త‌న స‌హోద్యోగి ఒక‌రు వ్య‌క్తిగ‌తంగా, వృత్తిప‌రంగా చాలా క‌ష్టాలు ఎదుర్కొన్నాడ‌ని చెప్పారు. అత‌డు శ్రీ‌వారికి అప‌ర‌భ‌క్తుడ‌ని, క‌ష్టాలు తీరితే స్వామివారి ద‌ర్శనానికి వ‌స్తాన‌ని మొక్కుకున్నాడ‌ని వివ‌రించారు. క‌ష్టాలు తీరిపోవ‌డంతో ఆ త‌రువాత తిరుమ‌ల‌కు వ‌చ్చి మొక్కు తీర్చుకున్నాడ‌ని తెలిపారు. అప్ప‌టినుండి తాను కూడా శ్రీ‌వారి మ‌హిమ‌లు తెలుసుకుంటున్నాన‌ని, క్ర‌మం త‌ప్ప‌కుండా ఎస్వీబీసీలో స్వామివారి కార్య‌క్ర‌మాల‌ను చూస్తున్నాన‌ని చెప్పారు. ఆ త‌రువాత శ్రీ‌వాణి ట్ర‌స్టు గురించి తెలుసుకుని ఆన్‌లైన్‌లో బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్నాన‌ని తెలిపారు. ఆన్‌లైన్‌లో గ‌ది కూడా బుక్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని త‌న‌కు తెలియ‌క‌పోవ‌డంతో తిరుప‌తిలో గ‌ది తీసుకున్నాన‌ని వివ‌రించారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకుని త‌న్మ‌య‌త్వానికి లోన‌య్యాన‌ని, ఇది స‌రికొత్త అనుభ‌వ‌మ‌ని తెలిపారు.

శ్రీ‌వారి ద‌ర్శనానంత‌రం థాయ్‌లాండ్ భ‌క్తుడు వేదాశీర్వ‌చ‌నం టికెట్ కొనుగోలు చేసి త‌న స్నేహితుల‌తో క‌లిసి రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేదాశీర్వ‌చ‌నం అందుకున్నారు. థాయ్‌లాండ్ భ‌క్తుల‌కు శ్రీ‌వారి చిత్ర‌ప‌టం, తీర్థ‌ప్ర‌సాదాల‌ను టిటిడి అద‌న‌పు ఈవో అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.